మరికాసేపట్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్

IPL-2022 Qualifier-2 Match Between Royal Challengers Bangalore and Rajasthan Royals Today, Qualifier-2 Match Between Royal Challengers Bangalore and Rajasthan Royals Today, Royal Challengers Bangalore and Rajasthan Royals, IPL-2022 Qualifier-2 Match Between RCB And RR, Royal-challengers Bangalore, Rajasthan Royals, Qualifier-2 Match, IPL-2022 Qualifier-2 Match, 2022 IPL Qualifier-2 Match, IPL-2022, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 చివరి దశకు చేరుకుంది. ప్లే ఆప్స్ లో ఇప్పటికే జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఐపీఎల్-2022 ఫైనల్ కు చేరుకోగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు క్వాలిఫయర్‌-2 కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న కీలక క్వాలిఫయర్‌-2 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకోని టైటిల్ కోసం గుజరాత్ టైటాన్స్ తో పోటీపడనుండగా, ఇక ఓడిపోయిన జట్టు ఐపీఎల్-2022 నుండి నిష్క్రమించనుంది.

పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలవడంతో రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఫైనల్ చేరేందుకు మరో అవకాశంగా నేడు క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఆర్ఆర్ జట్టులో జొస్ బట్లర్‌, కెప్టెన్ సంజు శాంసన్‌, హెట్‌మయర్‌, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ లో సత్తాచాటున్నారు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న జొస్ బట్లర్‌ తన ఫామ్ ను కొనసాగిస్తే ఆర్ఆర్ ఫైనల్ కు చేరే అవకాశం సులభం కానుంది. అలాగే ఆర్ఆర్ తరపున బౌలింగ్ లో అశ్విన్, చాహల్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ కీలకం కానున్నారు.

మరోవైపు బెంగళూరు జట్టులో కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, మాక్స్ వెల్ అంచనాలకు తగ్గట్టుగా రాణించాల్సి ఉంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రజత్‌ పాటిదార్‌ పై ఆర్సీబీ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. బౌలింగ్‌లో వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్ రాణించడంపైనే విజయావకాశాలు ఎక్కువుగా ఆధారపడి ఉన్నాయి. క్వాలిఫయర్‌-2 పోరులో ఏ జట్టు గెలిచి ఐపీఎల్-2022 ఫైనల్ కు వెళ్లనుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (తుదిజట్టు అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్.

రాజస్థాన్ రాయల్స్ (తుదిజట్టు అంచనా): సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, యజ్వేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =