ఐపీఎల్‌: మైదానంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌ల మధ్య గొడవపై బీసీసీఐ సీరియస్, 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా

IPL 2023 BCCI Fined 100 Per cent Match Fees For Virat Kohli and Gautam Gambhir Following On-Field Spat,BCCI Fined 100 Per cent Match Fees For Virat Kohli,BCCI Fined 100 Per cent Match Fees For Gautam Gambhir,Mango News,Mango News Telugu,Match Fees For Virat Kohli and Gautam Gambhir,LSG vs RCB IPL 2023,Virat Kohli Gautam Gambhir fined 100 percent match fees,IPL 2023,IPL 2023 Latest Updates,BCCI News Updates,BCCI 2023,Virat Kohli Latest Updates,Gautam Gambhir Latest Updates

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అనుకోని వివాదం చోటుచేసుకుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇది చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరియు ఎల్‌ఎస్‌జీ మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరూ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు, ఇతర సిబ్బంది వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయితే కెమెరాల సాక్షిగా వీరు ఇలా వాగ్వివాదానికి దిగడంతో అందరూ అవాక్కయ్యారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన వారితో పాటు టీవీలలో వీక్షిస్తున్న అభిమానులు కూడా షాక్ అయ్యారు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై ఐపీఎల్ యాజమాన్యం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సీరియస్‌గా స్పందించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ భారీ జరిమానా విధించింది. ఇద్దరికీ మ్యాచ్ ఫీజ్‌లో వంద శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.

అసలేమైందంటే.. సోమవారం రాత్రి జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో లఖ్‌నవూపై బెంగళూరు 18 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్‌ ఇచ్చుకునే సమయంలో కోహ్లీ మరియు గంభీర్ కూడా కరచాలనం చేసుకున్నారు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ, లఖ్‌నవూ బౌలర్ నవీనుల్ హఖ్ (అఫ్గానిస్తాన్) మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. అయితే ఈ క్రమంలో ఎల్‌ఎస్‌జి ఓపెనింగ్ బ్యాటర్ కైల్ మేయర్స్ కోహ్లీ వద్దకు వెళ్లి ఏదో చెప్పినట్లు అనిపించింది. తర్వాత గంభీర్ వచ్చి మేయర్‌ను తీసుకెళ్లాడు. దీంతో కోహ్లీ, గంభీర్ వద్దకు వచ్చి వివరించడానికి ప్రయత్నించాడు. అయితే, గంభీర్ పట్టించుకోకుండా ముందుకు సాగడంతో విరాట్ సీరియస్ అయ్యాడు. ఈ సందర్భంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరియు ఇరు జట్లలోని ఇతర ఆటగాళ్లు కొందరు వీరిద్దరినీ విడదీశారు. కాగా ఘటన అనంతరం కోహ్లీ మరియు గంభీర్ ఇద్దరూ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం లెవల్ 2 నేరాన్ని అంగీకరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here