రైతులెవరూ ఆందోళన చెందొద్దు, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది – మంత్రి గంగుల కమలాకర్‌

Minister Gangula Kamalakar Says Telangana Govt Decides To Buy Wet Grain From Farmers Due To Untimely Rains,Minister Gangula Kamalakar,Telangana Govt Decides To Buy Wet Grain From Farmers,Govt To Buy Wet Grain Due To Untimely Rains,Telangana Govt Decides To Buy Wet Grain,Mango News,Mango News Telugu,More untimely rain adds to Telangana farmers,Gangula deceiving farmers,Gangula Kamalakar Orders For Wet Grain,Minister Gangula Kamalakar Latest News,Telangana Minister Gangula Kamalakar Latest News,Telangana Government To Purchase Wet Food Grains,Telangana Latest News and Updates

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి అకాల వర్షాల నేపథ్యంలో.. పొలాల్లో తడిసిన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నూతన సచివాలయంలో ధాన్యం సేకరణపై ఆయన తొలి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఐకేపీ సెంటర్లలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అయితే తడిసిన ధాన్యం రా మిల్లింగ్‌కు పనికిరాదని, బాయిల్డ్‌ మిల్లింగ్‌ చేయించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌కు సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులెవరూ ఆందోళన చెందొద్దని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఇంకా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 5 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. అలాగే ఈ సీజన్ లో మొత్తం 1.28 లక్షల టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లింగ్‌ చేయడానికి ఆదేశాలు ఇచ్చామని.. అయితే ధాన్యం సేకరణ పెరిగేకొద్దీ బాయిల్డ్‌ మిల్లింగ్‌ పెంపునకు అనుమతులు ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం కలిగిన నేపథ్యలో.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + six =