టాటా గ్రూప్‌కు షాక్.. ఎయిర్ ఇండియా సీఈఓ పదవి నుంచి తప్పుకున్న ఇల్కర్ ఐసీ

New Air India CEO Ilker Ayci Decline Job Offer 2 Weeks After Appointment By Tata Group, Ilker Ayci Decline Job Offer 2 Weeks After Appointment By Tata Group, New Air India CEO Ilker Ayci, New Air India CEO, Air India CEO, Air India, Tata Group, Ilker Ayci, Air India Latest News, Air India Latest Updates, Air India Live Updates, CEO, Tata, Ilker Ayci Decline Job Offer, Mango News, Mango News Telugu,

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాత్రను తాను చేపట్టనని టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ మంగళవారం వెల్లడించారు. అతన్ని నియమించిన రెండు వారాలకే పదవినుంచి తప్పుకోవటం విశేషం. అయితే, ఇల్కర్ కు గతంలో ఉన్న రాజకీయ సంబంధాలపై భారతదేశంలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే టాటా గ్రూప్ కంపెనీ ఫిబ్రవరి 14న ఎయిర్ ఇండియా సీఈఓ మరియు మేనేజింగ్ ఎడిటర్‌గా ఐసీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, టాటా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో.. భారతీయ మీడియాలో నా అపాయింట్‌మెంట్‌ గురించి వస్తున్న విమర్శలు, ఆరోపణలు గురించి చదివిన తర్వాత ఆ పదవిని స్వీకరించడానికి నిరాకరించినట్లు ఐసీ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా, ఐసీ ఏప్రిల్ ఏప్రిల్ కంటే ముందుగానే ఎయిర్ ఇండియా సీఈఓగా చేరాలని భావించారు. ఐసీ నియామకాన్ని ప్రకటించిన సమయంలో.. టాటా సన్స్ ఛైర్మన్ N చంద్రశేఖరన్ మాట్లాడుతూ “ఇల్కర్ ఒక విమానయాన పరిశ్రమ నాయకుడు. అతను అక్కడ తన పదవీకాలంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ను విజయవంతంగా నడిపించాడు. ఇల్కర్‌ను టాటా గ్రూప్‌కు స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము” అని పేర్కొన్నారు. కొత్త శకంలో.. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో చేరడం చాలా సంతోషంగా ఉందని ఐసీ చెప్పారు. ఎయిరిండియాలోని నా సహోద్యోగులతో మరియు టాటా గ్రూప్ నాయకత్వంతో సన్నిహితంగా పని చేయతనికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు” అని చెప్పాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =