సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు, డేవిడ్ వార్నర్ నుంచి కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు

Kane Williamson Replaced David Warner As Sunrisers Hyderabad Captain For Rest Of The Season,Sunrisers Hyderabad,Hyderabad,Sunrisers,Mango News,Mango New Telugu,Kane Williamson,David Warner,Kane Williamson Replaced David Warner,Sunrisers Hyderabad Captain,Sunrisers Hyderabad IPL,IPL,IPL 2021,IPL 2021 News,IPL 2021 Latest News,IPL 2021 Latest Updates,Kane Williamson Replaces David Warner,Kane Williamson Replaces David Warner As Sunrisers Hyderabad Captain,Sunrisers Hyderabad Replace David Warner With Kane Williamson As Captain,David Warner Replaced By Kane Williamson As Sunrisers Hyderabad Captain,Sunrisers Hyderabad New,Sunrisers Hyderabad Latest News,Cricket,IPL 2021 Live Cricket,IPL 2021 Cricket Live

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ బాధ్యతలను డేవిడ్ వార్నర్ నుంచి కేన్ విలియమ్సన్ కు అప్పగిస్తునట్టు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.

“రేపటి మ్యాచ్ నుంచి మిగిలిన ఐపీఎల్-2021 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు అప్పగిస్తున్నాం. అలాగే రాజస్థాన్ రాయల్స్ తో రేపు జరిగే మ్యాచ్ కోసం విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్ ను కూడా మార్చాలని నిర్ణయం తీసుకున్నాం. డేవిడ్ వార్నర్ అనేక సంవత్సరాలుగా ఫ్రాంచైజీపై చూపిన అపారమైన ప్రభావాన్ని యాజమాన్యం గౌరవిస్తుంది. ఈ నిర్ణయం అంత తేలికగా రాలేదు. మిగిలిన సీజన్‌ను ఎదుర్కునే సమయంలో మైదానంలో మరియు వెలుపల విజయం కోసం కృషి చేయడానికి డేవిడ్ వార్నర్ మాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాం” అని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు ఈ సీజన్ లో ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించి 2 పాయింట్లతో ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here