నేడు అరుదైన ‘హైబ్రిడ్‌’ సూర్య గ్రహణం.. దీని ప్రత్యేకతలివే, ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే?

Rare Hybrid Solar Eclipse Appears Today For The First Time in a Decade After 2013,Rare Hybrid Solar Eclipse Appears,Solar Eclipse Appears Today For The First Time,Solar Eclipse Appears in a Decade After 2013,Mango News,Mango News Telugu,First Hybrid Solar Eclipse in a Decade Begins,First hybrid solar eclipse in a decade begins,Rare hybrid solar eclipse appears,Solar Eclipse 2023 Live,First Solar Eclipse Of 2023 On April 20,Surya Grahan 2023,Solar Eclipse 2023 Today,Solar Eclipse Latest News and Updates

గురువారం వినీలాకాశంలో అద్భుతం జరగనున్నది. 2023 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం నేడు సంభవించనుంది. అయితే ఇది మనకు తెలిసిన సూర్య గ్రహణాల కంటే కొంచెం విభిన్నమైనది. సూర్య గ్రహణాలు సాధారణంగా సంపూర్ణంగా, పాక్షికంగా, వలయాకారంగా ఏర్పడుతుండటం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఏడాదిలో ఏర్పడుతున్న ఈ తొలి సూర్య గ్రహణం మాత్రం వలయాకార సంపూర్ణ సూర్య గ్రహణం రూపంలో దర్శనమివ్వనుండటం విశేషం. అందుకే దీనిని ప్రత్యేకమైన, అరుదైన సూర్య గ్రహణమని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినపుడు సూర్య గ్రహణం సంభవిస్తుంది. అయితే అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకారం, నేటి సూర్య గ్రహణం సమయంలో భూమి ఉపరితలం వక్రంగా ఉన్నందున, చంద్రుడి నీడ భూమిపై ఏటవాలుగా ప్రయాణిస్తుంది.

ఈ క్రమంలో ఆ నీడ గ్రహణం దశ ప్రపంచ వ్యాప్తంగా మారుతుంది. అందుకే ఇది హైబ్రిడ్ సూర్య గ్రహణం అయింది. అంతేకాకుండా ప్రస్తుత సూర్య గ్రహణం భూమి నుంచి చంద్రుడు బాగా దూరంగా ఉన్నప్పుడు సంభవిస్తోంది. దీంతో సూర్య గ్రహణం సమయంలో చంద్రుడు చాలా చిన్న పరిమాణంలో కనిపిస్తాడు. అందుకే దీనిని ‘నిన్ గాలూ’ గ్రహణం అని కూడా సంభోదిస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ సూర్య గ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ సూర్య గ్రహణం ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం 11:30 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గ్రహణం రెండు గంటలకు పైగా ఉంటుంది, సూర్యుడు పూర్తికోణంలోకి వచ్చినపుడు సంపూర్ణ సూర్య గ్రహణం వ్యవధి ఒక నిమిషం కంటే తక్కువ ఉంటుంది.

కాగా ఇది భారతదేశంలో కనిపించదని, చంద్రుడు ప్రయాణించే మార్గంలో భారత భూభాగ ప్రాంతం దూరంగా ఉండటం వల్ల దీనిని భారత్‌లో చూడలేమని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు. కానీ భారతీయ పసిఫిక్ మహాసముదం ప్రాంతంలో కొన్ని సెకన్లపాటు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ కనిపిస్తుంది. చంద్రుడు సూర్యుని కేంద్రానికి మధ్యగా వచ్చినప్పుడు ‘అగ్ని వలయం’ ఏర్పడుతుంది. అయితే అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ హిందూ మహా సముద్రం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణాన్ని చూడగలమని వారు వెల్లడించారు. కాగా ఎక్స్‌మౌత్ (పశ్చిమ ఆస్ట్రేలియా), తైమూర్ లెస్టె, వెస్ట్ పాపువా (ఇండోనేషియా) అనే మూడు ప్రదేశాలలో మాత్రమే సంపూర్ణ గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. ఇక తదుపరి సూర్య గ్రహణం 2031లో సంభవించనుంది. ఆ తర్వాత వచ్చే శతాబ్దంలో.. అంటే మార్చి 23, 2164న ఇలాంటి హైబ్రిడ్ సూర్య గ్రహణాన్ని చూస్తారని నివేదికలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =