తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉంది – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Narendra Modi Says BJP is The Only Hope For All Section of People in Telangana,PM Narendra Modi Says BJP is The Only Hope,All Section of People in Telangana,PM Narendra Modi For All Section of Telangana People,BJP is The Only Hope For People in Telangana,Mango News,Mango News Telugu,Telangana Trusts Only BJP,Mission 2024 Nanni Modi campaign,BJP Party,BJP Party Latest News,Telangana News,Telangana BJP Chief Bandi Sanjay Kumar,PM Narendra Modi Latest News and Updates,Telangana BJP Party Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఏకైక పాన్ ఇండియా పార్టీ బీజేపీయేనని కూడా ఆయన అభివర్ణించారు. ఏ మేరకు న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాదిలో పార్టీ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ.. తెలంగాణలో ప్రజలు ఇప్పుడు ఒక్క బీజేపీపై మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారని, వారికి బీజేపీ మీద మాత్రమే భరోసా ఉందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీకి ఆదరణ పెరుగుతోందని, అక్కడి ప్రజలు తమ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇక ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్నామన్న ఆయన తమిళనాడు, కేరళల్లో బీజేపీ బూత్ స్థాయికి విస్తరించిందని అన్నారు.

దేశవ్యాప్తంగా ఈశాన్యం నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న కుటుంబ పార్టీల మధ్య ఒక్క బీజేపీ మాత్రమే ఏకైక పాన్-ఇండియా పార్టీగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వస్తున్న ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి.. అవినీతిపరులను కాపాడడం కోసం విపక్షాలు ‘బ్రష్టాచారి బచావో ఆందోళన్’ను ప్రారంభించాయని ఎద్దేవా చేశారు. భారత వ్యతిరేక శక్తులు రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తున్నాయని, ఈ కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని, అలాగే వారికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే, కోర్టులను లక్ష్యంగా చేసుకుంటారని, అంతిమంగా వారి ఉద్దేశం అవినీతిపరులను కాపాడడమేనని మండిపడ్డారు. స్థిరత్వం, నిబ్దత, కృషి వల్లే ఒకప్పుడు కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న పార్టీ ఇప్పుడు 300 మందికి పైగా పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here