కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని త్వరగా నియమించాలన్న జ్యోతిరాదిత్య సింధియా

Mango News, Jyotiraditya Scindia Comments Over Next President Of Congress Party, Congress must find a new president at the earliest says Scindia, Jyotiraditya Scindia About Congress Party, Jyotiraditya Scindia comments on Rahul Gandhi,Jyotiraditya Scindia Says Congress will have to search for a new President, Congress chief selection

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) మాజీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, జూలై 11 న భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి) తదుపరి అధ్యక్షుడిని త్వరగా నిర్ణయించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ను కోరారు. జూలై 11 న సింధియా మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ రాజీనామా చేసి ఇప్పటికే ఏడు వారాలు గడిచాయి, ఇప్పటివరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) పార్టీ యొక్క తదుపరి అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోలేదని, రాహుల్ గాంధీ కీలక బాధ్యతల నుండి తప్పుకున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ ని తిరిగి శక్తివంతం చేయగల వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన అన్నారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తరువాత, అనగా మే 25 న రాహుల్ గాంధీ తన రాజీనామాను సమర్పించారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి రాహుల్ గాంధీ బాధ్యత తీసుకున్నారు. సోనియా గాంధీ, ఇతర సీనియర్ నాయకులు ఎంత వారించినా వినకుండా, అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. రాహుల్ గాంధీ ఎంతకీ మనసు మార్చుకోకపోవడంతో నిరసనగా, భారతదేశం అంతటా చాలా మంది నాయకులు రాహుల్ గాంధీకి మద్దతుగా వారి రాజీనామాలను సమర్పించారు.

ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ , పార్టీ ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదురుకుంటున్నదని, తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు వెళ్లే ముందు, కాంగ్రెస్ తనను తాను పునరుద్ధరించుకోని మరియు తిరిగి ఆవిష్కరించుకోవాలి, ఆ క్షణం వచ్చిందని తాను భావిస్తున్నాను అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా జూలై 11 న మధ్యప్రదేశ్‌లోని గుణా నియోజక వర్గాన్ని సందర్శించి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలను కలిశారు. లోక్ సభ ఎన్నికలలో ఓటమి తరువాత గుణ నియోజక వర్గాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి ఇది.

[subscribe]
[youtube_video videoid=fpzrfUysh_k]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 4 =