రూట్ మార్చిన బీజేపీ.. వారి ఓటు బ్యాంక్‌పై ఫోకస్

BJP has changed its route Focus on their vote bank,BJP has changed its route,Focus on their vote bank,bjp, Kishan Reddy, Telangana BJP, Telangana Politics,Mango News,Mango News Telugu,Bharatiya Janata Party,Bjp Changes Focus Of Meet,Five assembly polls,The Politics of Access,Telangana BJP News,Telangana BJP Latest News,Telangana BJP Latest Updates,Telangana BJP Live News,Telangana Latest News And Updates
bjp, telangana bjp, telangana politics, kishan reddy

తెలంగాణలో ఎన్నికల వేడి ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. కనీసం రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో.. అన్ని పార్టీలు కంప్లీట్‌గా ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా వెళ్తున్నప్పటికీ.. బీజేపీ హవా మాత్రం కాస్త తక్కువగా కనిపిస్తోంది. ఆ పార్టీ గ్రాఫ్ కూడా పెరగడం లేదు కదా.. ఇంకా తగ్గుతూ పోతోంది. ఇటీవల ప్రధాని మోడీ, అమిత్ షాలు రంగంలోకి దిగినప్పటికీ.. పార్టీలో అంతగా జోష్ కనిపించలేదు. ఈక్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ రూట్ మార్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీలే ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమయిందట. బీసీలకు ఈసారి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఎక్కువ సీట్లు వారికే కట్టబెట్టే యోచనలో ఉందట. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. అందులో 44 సీట్లకు పైగా బీసీలకు కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉందట. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ముఖ్యంత్రి కుర్చీ కూడా బీసీ వర్గాల వారికే కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు  సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ముందు నుంచి కూడా బీజేపీ నేతలు బీసీలను ఆకట్టుకునేలా ప్రసంగాలు ఇస్తూ వస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో అగ్రవర్ణాల వారే ఉన్నారని.. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే బీసీలకు ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. ఆ పార్టీలు బీసీలకు కేబినెట్‌లో కూడా తగిన అవకాశాలు కల్పించవంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికి వరకు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు, వెనుకబడిన వర్గాల వారికి చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించిందట. బీసీలకు అండగా నిలిచేది కేవలం బీజేపీ మాత్రమే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం నేతలకు సూచించిందట.

ఇప్పటికే బీజేపీ నేతలు బీసీలను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ బీసీలకు దగ్గరగా ఉంటూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుల సంఘాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు.. తీసుకుంటున్న చర్యల గురించి జనాలకు వివరిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే.. ఉన్న ఏకైక అవకాశం బీసీ, వెనుక బడిన వర్గాల వారి ఓట్లు. అందుకనే అధిష్టానం ఆ దిశగా ఫోకస్ చేస్తోంది. బీసీల ఓట్లను కూడగట్టడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సానుకూల ఫలితాలు వస్తాయని నేతలు భావిస్తున్నారట. మరి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?.. బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =