దూకుడులో జ‌గ‌న్ త‌ప్ప‌ట‌డుగులు..!

Jagans mistakes in aggression,Jagans mistakes,mistakes in aggression,Mango News,Mango News Telugu,Andhrapradesh, AP Assembly Elections, AP Politics, CM Jagan, YCP,AP CM YS Jagan Mohan Reddy,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra pradesh Politics,YS Jagan Mohan Reddy Latest News,YS Jagan Mohan Reddy Latest Updates,YS Jagan Mohan Reddy Live News
cm jagan, ycp, ap politics, andhrapradesh, ap assembly elections
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌భ‌లు, స‌మావేశాల‌తో ప్ర‌జ‌ల్లో ఉండేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. బ‌స్సు యాత్ర‌కు కూడా స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌లే పార్టీ కో ఆర్డినేట‌ర్ల‌తో స‌మావేశ‌మై ఈ మేర‌కు త‌గిన సూచ‌న‌లు చేశారు. ప్ర‌జ‌ల్లోకి దూకుడుగా వెళ్లాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండ‌గా.. జ‌గ‌న్ కాకినాడ జిల్లా ప‌ర్య‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌భ నేప‌థ్యంలో జిల్లాలో విధించిన ఆంక్ష‌లు వైర‌ల్ గా మారుతున్నాయి. దూకుడులో జ‌గ‌న్ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌లంటే.. ప్రోటోకాల్ , ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా తీసుకునే చ‌ర్య‌ల్లో స్థానికంగా కొంత స‌మ‌యం ఇబ్బందులు ఏర్ప‌డ‌డం సాధార‌ణ‌మే. అవి ఎక్కువ‌గా ట్రాఫిక్ డైవ‌ర్ష న్ వ‌ల్ల కావొచ్చు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సామ‌ర్ల‌కోట ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స‌ర్కారు వినూత్న ఆదేశాలు జారీ చేయ‌డం చ‌ర్చేనీయాంశంగా మారింది. జిల్లాలోని  ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అంతేకాదండోయ్‌.. నీటి స‌ర‌ఫ‌రాలో కూడా ఆంక్ష‌లు విధించార‌ట‌. తెల్ల‌వారుజాము నాలుగు లోపే నీళ్లు బంద్ చేసేలా అధికారులు చేప‌ట్ట‌డంపై తీవ్ర దుమారం రేపుతోంది.
 అక‌స్మాత్తుగా స్కూళ్ల‌కు సెల‌వుపై పాఠశాలల ఉపాధ్యాయులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం చెప్పకుండా సెలవు ఇస్తున్నట్లు డీఈవో ఆదేశాలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే కారణం ఏం చెప్పాలని డీఈఓ తీరును ప్రభుత్వ టీచర్లు ప్రశ్నించారు. అయితే.. దీని వెనుక వింత వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. సీఎం స‌భ విజ‌య‌వంతం కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఉద‌యం నుంచే సీఎం ప‌ర్య‌ట‌న ఉండ‌డంతో సెల‌వు వ‌ల్ల ప్ర‌జ‌లు ఎక్కువ స్థాయిలో హాజ‌ర‌వుతార‌ని ఆ పార్టీ ఉద్దేశంగా క‌నిపిస్తుంది.
కాగా.. రేపు సామర్లకోటలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీఎం సభ.. రోడ్డు షోకు లక్ష మందిని బలవంతంగా తరలించేందుకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సభకు జనం వచ్చేలా గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి సరఫరా సమయాల్లో మార్పు చేయ‌డం మ‌రో వింత‌. తెల్లవారు జామున 4 గంటలకు మంచినీటి కుళాయిలను వదిలి పెడతామని వలంటీర్ల ద్వారా ప్రజలకు మెసేజ్‌లు పంపారు. నీళ్లు పట్టుకున్న తర్వాత ఉదయం 6గంటలకే సభకు రావాలని వారితో చెప్పించారు. డ్వాక్రా సభ్యులు అందరూ సభకు రాకపోతే పథకాలు రావని కూడా హెచ్చ‌రించ‌న‌ట్లు విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే.. జ‌గ‌న్ దూకుడులో త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =