రహానే, పుజారాకు ఇదే చివరి అవకాశం – సునీల్ గవాస్కర్

Ajinkya Rahane, IND vs SA 2nd Check, IND vs SA 2nd Test, India vs South Africa, India vs South Africa Cricket, India vs South Africa Highlights, India vs South Africa Match, India vs South Africa match news, Legenderay Cricketer Sunil Gavaskar, Legenderay Cricketer Sunil Gavaskar Makes BIG Statement, Legenderay Cricketer Sunil Gavaskar Makes BIG Statement over Cheteshwar Pujara, Mango News, Sunil Gavaskar, Sunil Gavaskar Makes BIG Statement over Cheteshwar Pujara Rahane

టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానేలకు ఇదే చివరి అవకాశం అవ్వొచ్చు అని వెటరన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో వీరిద్దరూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. వీరి ఫామ్ జట్టులో ఆందోళన కలిగిస్తోంది. వీరి పేలవ ఫామ్ కారణంగా మిడిలార్డర్ పై ఒత్తిడి పడుతోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో.. రహానే గోల్డెన్‌ డక్‌ కాగా, పుజారా కేవలం 3 పరుగులకే పెవియన్‌ చేరాడు. అయితే, దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టు ఎంపిక చేసే ముందే వీరిద్దరి చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ, ఇద్దరూ సీనియర్‌ ఆటగాళ్లు కావటంతో విదేశాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా చోటు దక్కింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోతున్నారు.

ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్ వీరిద్దరిపై కీలక వాఖ్యలు చేశాడు. ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ వీళ్లిద్దరికి అత్యంత కీలకం అని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. టీమిండియా లో ఇప్పటికే యువ ఆటగాళ్లు రాణిస్తుండంతో, వీళ్లు జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అతడు తెలిపాడు. “పుజారా, రహానే ఇద్దరూ వారి టెస్ట్ కెరీర్‌ను కాపాడుకోవడానికి ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌ కీలకం. ఈ ఇన్నింగ్స్‌లో ఏదో ఒక స్కోర్‌ సాధించి జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే వారు జట్టులో తమ స్ధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీళ్లకు శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది” అని గవాస్కర్‌ పేర్కొన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =