కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వియత్నాం పర్యటన.. తొలిసారిగా కీలక ఒప్పందంపై ఇరుదేశాల సంతకాలు

Rajnath Singh Vietnam Tour India Signs MoU on Defence Partnership of Mutual Logistics Support, India Signs MoU on Defence Partnership of Mutual Logistics Support, Mutual Logistics Support, India and Vietnam signed an MoU on mutual logistics support, MoU on mutual logistics support, India and Vietnam, India and Vietnam signed a Memorandum of Understanding on mutual logistics support, Memorandum of Understanding, Vietnam, India, MoU on Defence Partnership, Defence Partnership, Rajnath Singh, Rajnath Singh Vietnam Tour News, Rajnath Singh Vietnam Tour Latest News, Rajnath Singh Vietnam Tour Latest Updates, Rajnath Singh Vietnam Tour Live Updates, Mango News, Mango News Telugu,

భారతదేశం మరియు వియత్నాం బుధవారం ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించే దిశగా కీలక రక్షణ భాగస్వామ్యం యొక్క ఉమ్మడి విజన్ స్టేట్‌మెంట్‌పై సంతకం చేశాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు వియత్నాం చేరుకున్నారు. విమానాశ్రయంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్, రాజ్‌నాథ్‌ సింగ్‌కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు జనరల్ ఫాన్ వాన్ గియాంగ్ ఈ కీలక ప్రకటన ‘2030 వైపు రక్షణ భాగస్వామ్యం’పై సంతకం చేశారు. కాగా ఇండియాతో వియత్నాం తొలిసారిగా కుదుర్చుకున్న కీలక ఒప్పందం ఇదే కావడం విశేషం.

ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇద్దరు మంత్రుల సమక్షంలో పరస్పర లాజిస్టిక్స్ మద్దతుపై అవగాహన ఒప్పందం కుదిరిందని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే వియత్నాం ఏ దేశంతోనైనా సంతకం చేసిన మొదటి అతిపెద్ద ఒప్పందం మనతోనే కావడం గమనార్హం అని తెలిపింది. ఇక వియత్నాంకు భారత్ అందజేయనున్న 500 మిలియన్ డాలర్ల రక్షణ శ్రేణి క్రెడిట్‌ను త్వరగా ఖరారు చేయడానికి కూడా ఇద్దరు మంత్రులు అంగీకరించారు. ఇరు దేశాలకు చైనాతో ఉన్న సమస్యల నేపథ్యంలో ఈ కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వియత్నాం మిలిటరీ సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్‌లో లాంగ్వేజ్ మరియు ఐటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి రెండు సిమ్యులేటర్లు మరియు మానిటరీ గ్రాంట్‌ను కూడా అందిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 15 =