ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ను మరే ఇతర సంస్థతో విలీనం చేసే ప్రతిపాదన లేదని ఫిబ్రవరి 17, సోమవారం నాడు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ప్రకటించింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ను ఐడీబీఐ బ్యాంకులో విలీనం చేస్తారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అటువంటి ప్రతిపాదన ఏమిలేదని ఎల్ఐసీ సంస్థ ప్రకటన విడుదల చేసింది. అవాస్తవమైన పుకార్లు ప్రచారం జరుగుతున్నాయంటూ విలీన వార్తలను ఎల్ఐసీ ఖండించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ సైతం తన బోర్డు సమావేశంలో అలాంటి ప్రతిపాదన ఏదీ చర్చించలేదని స్పష్టం చేసింది. అలాగే విలీనం వార్తల నేపథ్యంలో సోమవారం నాడు ట్రేడింగ్‌లో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు విలువ పడిపోయింది. స్క్రిప్ 7.71 శాతం కోల్పోయి రూ.380.30 వద్ద ముగిసింది. ఐడీబీఐ షేరు విలువ కూడా 2.54 శాతం క్షీణించి రూ.34.50 వద్ద ముగిసింది.
[subscribe]