ముకేష్ అంబానీకి మొదటి స్థానం.. రెండో ప్లేసుతో సరిపెట్టుకున్న అదానీ

Mukesh Ambanis First Place Adani Second Place,Mukesh Ambanis First Place,Adani Second Place,Mango News,Mango News Telugu,Adani, Cyrus Poonawalla, Gopi Chandh Hindhuja, Kumar Mangalam Birla, Mukesh Ambani, Neeraj Bajaj, Nl Mittol, One Wealth Huron India Rich List, Radha Krishnan, Shiv Nadar Is the Chairman of Hcl,Gautam Adani Comes in Second,Mukesh Ambani Reclaims Indias Richest Man,Mukesh Ambani Becomes Indias Wealthiest,Mukesh Ambani Latest News,Mukesh Ambani Latest Updates,Mukesh Ambani Live News
ambani
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ నిలిచి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్థానానికి ఎగబాకిన ముకేష్ అంబానీ.. మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
వన్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లో.. 360 మంది అత్యంత సంపన్నులలో మొదటి స్థానం ముకేష్ అంబానీకి దక్కించుకున్నారు. దశాబ్ద కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్ 150 బిలియన్ డాలర్లను దాటిపోయాయి. ఇండియాలోనే ఇవి అత్యధిక పెట్టుబడులుగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో 66 ఏళ్ల ముకేష్  సంపద.. నాలుగు రెట్లు పెరిగిందని తేలింది. అంటే.. 2014లో రూ. 1,65,100 కోట్లగా ఉన్న సంపద ఇప్పుడు రూ. 8,08,700 కోట్లకు పెరిగింది.
మరోవైపు అదానీ గ్రూప్ చైర్మన్.. 61ఏళ్ల గౌతమ్ అదానీ రెండవ స్థానానికి చేరారు. ఒక్క ఏడాది కాలంలోనే అదానీ సంపద రూ.6,19,000 కోట్లు ఆవిరైపోవడంతో.. అదానీని అంబానీ క్రాస్ చేసి మొదటి స్థానంలో సెటిలయిపోయారు.
అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రొడెక్ట్ చేసే కంపెనీ.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు 82 ఏళ్ల సైరస్ పూనావాలా మూడో స్థానంలో నిలిచారు. ఆయన సంపద గత సంవత్సర కాలంలో 36 శాతం అంటే రూ.73,100 కోట్లు పెరిగింది.
వన్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లో .. 78 సంవత్సరాల  హెచ్‌సీఎల్ ఛైర్మన్ శివ్ నాడార్ నాలుగవ స్థానంలో నిలిచారు. ఆయన సంపద గత సంవత్సర కాలంలో 23 శాతం పెరిగి రూ.2,23,900 కోట్లకు చేరుకుంది. అలాగే ఐదవ స్థానంలో నిలిచిన.. గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ సంపద 7 పర్సంట్ పెరిగి  రూ.1,76,500 కోట్లకు చేరుకుంది.
మరోవైపు భారతదేశంలోని అతిపెద్ద ఫార్మసీ కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు.. 68 ఏళ్ల దిలీప్ షాంఘ్వీ ఆరవ స్థానంలో నిలిచారు. దిలీప్ షాంఘ్వీ సంపద 23 శాతం పెరుగుదలతో రూ.1,64,300 కోట్లకు చేరుకున్నట్లు వన్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్  తేల్చింది. అటు..ఆర్సెలర్ మిట్టల్‌కు చెందిన 73ఏళ్ల ఎల్‌ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ ఏడవ స్థానంలో నిలిచారు. ఎల్‌ఎన్ మిట్టల్ సంపద 7 శాతం పెరిగి.. రూ.1,62,300 కోట్లకు చేరుకుంది.
అలాగే అవెన్యూ అపార్ట్‌మెంట్స్  అధిపతి అయిన 68 ఏళ్ల  రాధాకృషన్ దామని 8వ స్థానంలో నిలిచారు.   కాకపోతే గతేడాది కంటే రాధాకృషన్ దామని 18 శాతం తగ్గి రూ. 1,43,900 కోట్ల వద్ద నిలవడంతో 8 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన 56 ఏళ్ల కుమార్ మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ 9వ స్థానంలో నిలిచారు. కుమార్ మంగళం బిర్లా సంపద 5 పర్సంట్ పెరుగుదలతో రూ.1,25,600 కోట్లకు చేరుకుంది.
అలాగే వన్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023లో 10వ స్థానంలో .. బజాజ్ గ్రూప్‌నకు చెందిన నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ నిలిచారు. నీరజ్ బజాజ్ సంపద 7 శాతం పెరుగుదలతో రూ. 1,20,700 కోట్లకు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =