ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం ఉద్ధవ్‌ థాకరే భేటీ

Delhi, Maharashtra Chief Minister, Maharashtra Chief Minister Uddhav Thackeray, Maharashtra Chief Minister Uddhav Thackeray Meets Prime Minister Narendra Modi, Maharashtra Chief Minister Uddhav Thackeray Meets Prime Minister Narendra Modi at Delhi, Mango News, Maratha quota, Mumbai News LIVE Updates, Narendra Modi, Prime Minister, Prime Minister Narendra Modi, Uddhav Thackeray, Uddhav Thackeray meets Modi

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం ఉద్ధవ్ థాకరే 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధాని మోదీని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో ఉద్దవ్ థాకరే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేబినెట్ మంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా మరాఠా రిజర్వేషన్స్, ఓబిసి రిజర్వేషన్స్, తుఫాను సహాయం, వ్యాక్సిన్ల కేటాయింపు సహా పలు అంశాలపై వారు ప్రధానితో చర్చించినట్టు తెలుస్తుంది.

భేటీ అనంతరం సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ సేకరణను కేంద్రీకృతం చేసినందుకు గాను ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికి త్వరలోనే వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు. మహారాష్ట్రలో 18-44 సంవత్సరాల కేటగిరిలో 6 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయడానికి 12 కోట్ల డోసుల అవసరమని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here