సుప్రీంకో​ర్టులో ఏక్‌నాథ్‌ షిండే వర్గ ఎమ్మెల్యేలకు ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

Maharashtra Political Crisis SC Issues Notices To Uddhav Govt on Rebel MLAs Plea Against Disqualification, SC Begins Hearing Petition Filed Against Disqualification Of Shinde And Rebel Shiv Sena MLAs, SC Begins Hearing Petition Filed Against Disqualification Of Rebel Shiv Sena MLAs, SC Begins Hearing Petition Filed Against Disqualification Of Shinde, Filed Against Disqualification Of Shinde And Rebel Shiv Sena MLAs, Disqualification Of Rebel Shiv Sena MLAs, Disqualification Of Shinde, Maharashtra Political Crisis, Shiv Sena rebel MLAs moved the Supreme Court and filed a petition against the Deputy Speaker of Maharashtra Narhari Zirwal, petition against the Deputy Speaker of Maharashtra Narhari Zirwal, Deputy Speaker of Maharashtra Narhari Zirwal, Narhari Zirwal, Deputy Speaker of Maharashtra, Maharashtra Political Crisis News, Maharashtra Political Crisis Latest News, Maharashtra Political Crisis Latest Updates, Maharashtra Political Crisis Live Updates, Mango News, Mango News Telugu,

సుప్రీంకో​ర్టులో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. శివసేన జారీ చేసిన అనర్హత నోటీసులపై ఏక్‌నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ మేరకు వారి పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది.

అయితే దీనికి ముందు శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏక్‌నాథ్‌ షిండే సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా షిండే తరపున సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ వాదిస్తూ ఇలా నోటీసులు జారీచేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని కోర్టుకి విన్నవించారు. దీంతో ఏకీభవించిన కోర్ట్ జూలై 11 వరకూ తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్‌ కి, అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తొలుత ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు, ఆ తర్వాత 3 రోజుల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా ఉద్ధవ్ వర్గం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =