భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరం ఢిల్లీనే అట..

Not Only in India Delhi Is the Most Polluted City in the World,Not Only in India,Delhi Is the Most Polluted City,Most Polluted City in the World,Air Quality Index,Delhi,Swiss Group IQ Air, Most Polluted City Delhi ,Delhi Is the Most Polluted City in the World,Mango News,Mango News Telugu,Worlds Most Polluted Cities,Toxic Haze Blankets,Indias New Delhi Blanketed by Toxic Haze,Delhi Air Pollution Spikes to 100 Times,Who Health Limit,Delhi Latest News,Delhi Latest Updates,Delhi Live News
Air quality index,Delhi,Swiss Group IQAir, most polluted city Delhi ,Delhi is the most polluted city in the world.

ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్ సిటీగా ఢిల్లీ నిలవడం పర్యావరణవేత్తలను ఆందోళనలో పడేస్తోంది.  అవును అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ  అగ్రస్థానంలో నిలవగా.. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబై సిటీలు టాప్‌ 5లో ఉన్నాయి. దీనిపై స్విస్‌ గ్రూప్‌ ఐక్యూ ఎయిర్‌ నివేదికను రిలీజ్ చేసింది

ప్రపంచంలోనే  అత్యంత పొల్యూషన్ సిటీలలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. స్విస్‌ గ్రూప్‌ ఐక్యూ ఎయిర్‌  రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం.. నవంబర్ 5 అనగా ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ  ఇండెక్స్ (ఏక్యూఐ)  483గా ఉంది. దీంతో ఐక్యూ ఎయిర్‌ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్లు తేలింది. అలాగే 371 పాయింట్లతో పాకిస్థాన్‌లోని లాహోర్‌ రెండో ప్లేసులో ఉండగా, 206 పాయింట్లతో కోల్‌కతా, 199 పాయింట్లతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, 167 పాయింట్లతో పాకిస్థాన్‌లోని కరాచీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అలాగే  162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ 159 పాయింట్లతో, 169పాయింట్లతో హాంగ్జౌ , 155  పాయింట్లతో కువైట్ సిటీ, 152 పాయింట్లతో చైనాలోని వుహాన్  టాప్‌ టెన్‌లో నిలిచాయి. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు, గాలి సరిగా లేకపోవడం దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. అంతేకాదు ఢిల్లీలోని కాలుష్యానికి చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం కూడా ఓ కారణమేనని.. అందుకే ఢిల్లీలోని గాలి కలుషితం అవుతున్నట్టు అధికారులు అంటున్నారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏక్యూఐ 550కి చేరుకుంది. దీంతో 2 కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి ఎయిర్ క్వాలిటీ  ఇండెక్స్  0-50గా ఉంటే ఆ గాలి నాణ్యంగా ఉన్నట్టు లెక్క.  కానీ, ఢిల్లీలో ఏ సమయంలో చూసినా  కూడా 400-500గా ఉండడంతో.. ఈ గాలిని పీల్చడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా.. కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడుతున్నారని.. ఇంకా చాలామంది ఈ రోగాల బారిన పడే అవకాశం ఉందని  అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీని  అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించిన అధికారులు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఢిల్లీ ప్రధమ స్థానంలో ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =