సంచలన నిర్ణయం తీసుకున్న ఠాక్రే సర్కార్.. షిండేకు పట్టున్న థానేలో జూన్ 30 వరకు 144 సెక్షన్

Maharashtra Political Crisis Section 144 Imposed in Eknath Shinde's Stronghold Thane Upto June 30, Section 144 Imposed in Eknath Shinde's Stronghold Thane Upto June 30, 144 Section imposed in Eknath Shinde's stronghold Thane, Shinde Camp to Announce Shiv Sena Balasah, Shiv Sena Balasah, Eknath Shinde, Eknath Shinde Camp, Shiv Sena Sena's Sanjay Raut dares rebel Shinde as crisis deepens in Maharashtra, political instability in Maharashtra, Section 144 imposed imposed in Thane city, Thane city, Section 144, Eknath Shinde's stronghold Thane, Maharashtra Political Crisis News, Maharashtra Political Crisis Latest News, Maharashtra Political Crisis Latest Updates, Maharashtra Political Crisis Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర సంక్షోభం ముదిరి పాకాన పడుతున్నది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేపై పైచేయి సాధించేందుకు ఉద్దవ్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా షిండేకు బలమైన పట్టున్న, ఆయన స్వస్థలమైన థానేలో నిషేధాజ్ఞలు విధించింది. జూన్ 30 వరకు అక్కడ 144 సెక్షన్ జారీ చేసింది. ఆయుధాలు ధరించి తిరగడం, దిష్టిబొమ్మలను దహనం చేయడం, గుంపులుగా సమావేశాలవడం, రాజకీయ ఊరేగింపులు తీయడం వంటివాటిపై థానే పోలీసులు నిషేధం విధించారు. మహారాష్ట్రలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఠాక్రే సర్కార్ ప్రకటించింది.

ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే తన వర్గంతో కలిసి అస్సాంలో క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేయనున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర అంతటా షిండేకు వ్యతిరేకంగా శివసేన శ్రేణులు నిరసన తెలిపే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు ఆయన అనుయాయుల ఇళ్ల వద్ద తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే కొందరు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని శివసేన కోరిన నేపథ్యంలో.. ఏక్‌నాథ్ షిండేతో సహా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ రేపు నోటీసులు పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై షిండే వర్గం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =