పరువునష్టం కేసులో.. సూరత్ సెషన్స్‌ కోర్టులో రాహుల్‌ గాంధీ పిటీషన్‌, రెండేళ్ల జైలు శిక్షపై అప్పీల్

Congress Leader Rahul Gandhi Appealed in Surat Sessions Court Against His Conviction of Defamation Case,Congress Leader Rahul Gandhi Appealed in Surat,Surat Sessions Court Against His Conviction,Court Against His Conviction of Defamation Case,Mango News,Mango News Telugu,Sessions court grants bail to Rahul Gandhi,Rahul Gandhi defamation case Live Updates,Rahul Gandhi defamation case,Cong leader's first reaction after filing appeal,Rahul Gandhi Latest News,Rahul Gandhi Latest Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గత నెలలో సూరత్ కోర్టు పరువునష్టం కింద దోషిగా నిర్ధారించి అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. క్రిమినల్ పరువునష్టం కింద దోషిగా నిర్ధారించిన దిగువ కోర్టు ఉత్తర్వులపై సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేశారు. ఇక సూరత్ పర్యటనలో భాగంగా రాహుల్ వెంట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటు గడువు ఇచ్చిన క్రమంలో దాదాపు 10 రోజుల తర్వాత, సెషన్స్‌ కోర్టులో ఆయన పిటిషన్‌ వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ఈ ఉదయం రాహుల్ గాంధీ తల్లి, సీపీసీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ మరియు ఆయన సోదరి ప్రియాంక వాద్రా గాంధీలు ఆయన నివాసానికి వచ్చారు.

ఈ క్రమంలో దీనిపై విచారణ జరుపనున్న సూరత్ సెషన్స్ కోర్టు.. దిగువ కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే మాత్రం దాదాపు 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే రాహుల్ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. కాగా సూరత్ కోర్టు జైలు శిక్ష విధించిన తర్వాత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు విధించడంతో పాటు ఆయన నివసిస్తున్న అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలని లోక్‌సభ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ అనర్హత విషయమై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =