మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 10 మంది పిల్లలు మృతి

10 new born babies killed in Bhandara, 10 newborn babies die after a fire breaks out, 10 newborn babies die in Maharashtra fire at hospital, 10 newborn babies die in major fire at hospital, 10 Newborn Babies Died, Bhandara hospital fire, Bhandara hospital fire newborn babies death, Maharashtra 10 Newborn Babies Died, Maharashtra Hospital Fire Accident, Maharashtra Hospital Fire Accident News, Major Fire Accident in a Hospital at Maharashtra, Mango News, newborn babies death, Ten babies killed after fire tears, Ten newborn babies died after a massive fire broke

మహారాష్ట్ర రాష్ట్రంలోని భండారా జిల్లాలో గల ఓ జనరల్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 2 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఐసీయూ విభాగమైన సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సీయూ)లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు కన్నుమూశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ విభాగంలో మొత్తం 17 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు వ్యాపించగానే ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై ఏడుగురు పిల్లల్ని కాపాడగలిగారు. షార్ట్ సర్క్యూట్ వలనే ఐసీయూలో మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు.

అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారుల మరణం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మాట్లాడి ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించాలని సీఎం ఉద్ధవ్ థాకరే ఆదేశించారు. మరోవైపు ప్రమాదంలో చిన్నారుల మృతి చెంద‌డం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − twelve =