కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జూ. ఎన్టీఆర్‌ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

AP Ex Minister Kodali Nani Interesting Comments on Junior NTR Meeting with Union Home Minister Amit Shah, Kodali Nani Interesting Comments on Junior NTR Meeting with Union Home Minister Amit Shah, Comments on Junior NTR Meeting with Union Home Minister Amit Shah, AP Ex Minister Sensational Comments on Junior NTR Meeting with Union Home Minister Amit Shah, Junior NTR Meeting with Union Home Minister Amit Shah, Union Home Minister Amit Shah, Junior NTR, AP Ex Minister Kodali Nani, Amit Shah, Kodali Nani News, Kodali Nani Latest News And Updates, Kodali Nani Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు బీజేపీ సభలో​ పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం తెలంగాణకు వచ్చిన సందర్భంగా.. ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి భేటీపై రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని తాను అనుకోవడం లేదని, రాజకీయ వ్యూహంలో భాగంగానే వీరి కలయిక జరిగి ఉంటుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఇక రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ కానీ, హోం​ మంత్రి అమిత్‌ షా కానీ ఎవరితోనూ మాట్లాడరని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బీజేపీని విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా అనేక ఎత్తుగడలను అమలు చేస్తుంటారని కొడాలి తెలిపారు. ప్రస్తుతం జూనియర్ తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని, ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ సేవలను తెలుగు రాష్ట్రాలకు ఆవల కూడా వినియోగించుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలలో ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించే అవకాశం ఉందిని, దీనిలో భాగంగానే అమిత్ షా.. ఎన్టీఆర్‌ను కలిసి ఉండొచ్చని కొడాలి నాని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here