ఐపీఎల్ వేలం కోసం 292 మందితో తుదిజాబితా, శ్రీశాంత్ కు దక్కని చోటు

IPL-2021 Player Auction: Final List Announced with 292 Players,Mango News,Mango News Telugu,IPL 2021: BCCI Announces Complete Players List For Upcoming Auction 292 Cricketers to go Under The Hammer,IPL 2021 player auction list released 292 cricketers to go under the hammer,IPL 2021 Player Auction List Announced 292 Players To Go Under Hammer On February 18,From Harbhajan Singh to Arjun Tendulkar: Complete breakdown of IPL 2021 player auction list,IPL 2021 Auction: 292 players to go under the hammer Harbhajan and Kedar among 10 with Rs 2 crore base price

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 1114 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తాజాగా ఎనిమిది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌ను కూడా సమర్పించడంతో, వేలంలో ఉండే 292 మంది క్రికెటర్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ గురువారం నాడు ప్రకటించింది. మొత్తం 292 మంది క్రికెటర్లలో 164 మంది భారత్, 125 మంది విదేశీ, ముగ్గురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు. ఈ వేలం ద్వారా 8 ప్రాంఛైజీలు కలిపి 61 మంది ఆటగాళ్లను తీసుకోనున్నారు. వీరిలో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్ళు ఉండే అవకాశం ఉంది.

ఇక కనీస 2 కోట్లు ధర జాబితాలో భారత్ నుంచి హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ మాత్రమే ఉన్నారు. గ్లెన్ మాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ వంటి ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ళు కూడా కనీస 2 కోట్ల జాబితాలో ఉన్నారు. అలాగే 12 మంది కనీస 1.5 కోట్ల ధర జాబితాలో, 11 మంది కోటి రూపాయల కనీస ధర జాబితాలో ఉన్నారు. 292 తో కూడిన తుది జాబితాలో శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. అయితే మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ.20 లక్షల జాబితాలో ఉన్నాడు.‌

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =