ముంబైని వణికిస్తున్న ‘మీజిల్స్’ వ్యాధి.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, ఆందోళనలో అధికారులు

Mumbai Struggles with Measles Outbreak BMC Reports Hundreds of Cases in Children,Mumbai Measles Outbreak,Measles Outbreak,Measles Outbreak BMC Reports,BMC Reports Measles Outbreak,Mango News,Mango News Telugu,Mumbai Latest News And Updates,Measles Outbreak News and Live Updates,Measles Outbreak News,Measles Outbreak Mumbai,Measles Outbreak In Mumbai,Mumbai Struggles With Measles Outbreak,Mumbai Measles Cases On Rise,Measles Cases On Rise In Mumbai,Mumbai Measles Outbreak,Measles Cases On Rise In Mumbai

ముంబైని ‘మీజిల్స్’ వ్యాధి వణికిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ముంబైలో కొత్తగా మరో 20 మీజిల్స్ కేసులు నమోదయ్యాయని, అలాగే ఏడాది వయసున్న ఒక బాలుడు మృతి చెందాడని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. వ్యాధిని గుర్తించిన తరువాత, చిన్నారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించబడిందని, అయితే ఆ తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స సమయంలో అతనికి శ్వాసకోశ వైఫల్యం ఏర్పడటంతో సోమవారం వెంటిలేటర్‌పై ఉంచారని, కానీ పరిస్థితి మరింత విషమించి ప్రాణాలు కోల్పోయాడని వివరించింది. ప్రస్తుతం అనుమానిత కేసుల సంఖ్య 3,378కి చేరుకుందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తానాజీ సావంత్ అధ్యక్షతన సమావేశమయ్యారు. కాగా ముంబయిలో మీజిల్స్ వ్యాప్తి దృష్ట్యా, పౌరులందరూ తొమ్మిది నెలల నుండి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముంబైలో ఇప్పటివరకు 220 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీజిల్స్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10 వరకు ఉంది. ముందుజాగ్రత్తగా అంధేరీలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో 120 పడకలను మీజిల్స్‌ రోగులకు కేటాయించారు. ఇందులో 100 ఆక్సిజన్ పడకలు, 10 వెంటిలేటర్లు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ఐసీయూ) 10 పడకలు ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 12 =