డిసెంబర్​ 5న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం

TDP Chief Chandrababu Gets Invitation For The Meeting to be Chaired by PM Modi on 5th Dec,Meeting by PM Modi,PM Modi Invitation To Many Politicians,Indian Prime Minister Modi,Mango News,Mango News Telugu,Narendra Modi,Gujarat , Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,PM Narendra Modi, Modi Latest News And Updates,Gujarat Assembly News And Live Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్​ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగనున్న కీలక సమావేశానికి.ఆయన హాజరుకానున్నారు. ఈమేరకు చంద్రబాబును ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. కాగా డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించి ప్రధాని మోదీ సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

ఇక డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో సమావేశ ప్రాధాన్యతను ప్రహ్లాద్‌ జోషి, చంద్రబాబు నాయుడుకి వివరించి చెప్పినట్లు సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లటానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల తరువాత బీజేపీ మరియు టీడీపీ మధ్య అంతగా సత్సంబంధాలు లేని నేపథ్యంలో చంద్రబాబును కేంద్రం ఆహ్వానించడం మరోసారి ఏపీ రాజకీయాల్లో ఆస్తక్తి రేపుతోంది. గతంలో కూడా ఒకసారి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అప్పుడు ప్రధాని మోదీ, చంద్రబాబు ఇరువురూ కరచాలనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇది అప్పట్లో ఏపీ రాజకీయాల్లో కొంత కలకలం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ బీజేపీతో పొత్తుకు ఆశావహంగా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబును కేంద్రం ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =