దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి: నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు బాట పడుతున్న పలు రాష్ట్రాలు

Coronavirus, COVID-19, COVID-19 Cases in India, covid-19 new variant, Mango News, Mango News Telugu, New Covid 19 Variant, Night Curfew, Night Curfew In India, Night Curfew in Madhya Pradesh, Omicron, Omicron Cases In India, Omicron covid variant, Omicron Effect, Omicron variant, Update on Omicron, Uttar Pradesh and Several States Announces Restrictions

దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి మరోసారి ఆందోళనగా మారుతుంది. ఇప్పటివరకు మొత్తం 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ విస్తరణ, కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ఆంక్షలు బాట పడుతున్నాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సహా వరుసగా పండుగల సీజన్ ఉండడంతో ప్రజలు పెద్దఎత్తున గుమిగూడకుండా, పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలను అమలు చేసేందుకు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమై ఆంక్షలను ప్రకటించాయి.

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో, మళ్ళీ కరోనా కేసులు పెరుగుతాయనే ఆలోచన దృష్ట్యా రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను తిరిగి అమలుచేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం నాడు ప్రకటించారు. కాగా మధ్యప్రదేశ్ లో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదు. ఇక ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా డిసెంబర్ 25వ తేదీ నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలో వివాహాలకు కూడా 200 మందికి మించి అనుమతి ఉండదని వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదర, జామ్‌నగర్‌, భావ్‌నగర్‌, గాంధీనగర్‌, జునాగఢ్‌ వంటి 8 నగరాల్లో డిసెంబర్‌ 31 వరకు అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ముంబయిలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో డిసెంబర్‌ 31 వరకు అర్ధరాత్రి వరకు 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఇక ఢిల్లీలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మరియు సమావేశాలపై నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (డీడీఎంఏ) అథారిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మొదటి, రెండు కరోనా వేవ్ లు తీవ్ర ప్రభావం చూపడంతో, మూడో వేవ్ దృష్ట్యా అన్ని రాష్ట్రాలు ముందస్తుగానే కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =