నా మాటలు అశ్విన్ ను బాధపెట్టి ఉంటే సంతోషమే – మాజీ కోచ్ రవిశాస్త్రి

Ex-PAK captain reacts to Shastri’s remarks on Ashwin, Mango News, ravi shastri, Ravi Shastri Gives A Burning Response To Ravichadran, Ravi Shastri Responds After Ravi Ashwin, Ravi Shastri Responds Over Spinner Ravichandran Ashwin Comments, Ravi Shastri responds to Ashwin over Kuldeep Yadav statement, Ravi Shastri responds to Ravichandran Ashwin, Ravi Shastri vs Ravichandran Ashwin, Spinner Ravichandran Ashwin, Team India Former Head Coach, Team India Former Head Coach Ravi Shastri, Team India Former Head Coach Ravi Shastri Responds Over Spinner Ravichandran Ashwin Comments

టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాటల వలన బాధపడి ఉంటే అందుకు సంతోషమేనని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా 2-1 తేడాతో తొలిసారి ఆ గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. దీనిలో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, కుల్దీప్ ప్రదర్శనపై రవిశాస్త్రి ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో తమ తొలి ప్రాధాన్య స్పిన్నర్ కుల్దీప్ యాదవేనని అన్నాడు. కానీ, ఆ టెస్టులో చోటు దక్కని అశ్విన్ ఈ వ్యాఖ్యలపై కలత చెందాడు. కొద్దిరోజుల క్రితం అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిని గుర్తుచేసుకున్నాడు. ఆ రోజు కోచ్ మాటలు తనను చాలా కలచివేశాయని.. ఏకంగా తనని బస్ కింద తోసేసినట్లు అనిపించిందని, తన బాధను వ్యక్తపరిచాడు. అశ్విన్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి స్పందిస్తూ ఇలా అన్నాడు..

‘ఆ మ్యాచ్ అశ్విన్ ఆడలేదు. కానీ, ఆ రోజు కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలాంటప్పుడు నేను అతడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయమే కదా.. నేనలా చేయడం వల్లే అశ్విన్ మళ్లీ తన ఆటపై దృష్టిసారించి తిరిగి జుట్టులోకి రాగలిగాడు. ఎలాంటి మొహమాటం లేకుండా నిజాలు చెప్పడమే నా పని. అంతేకాని, ప్రతి ఒక్కరికి బటర్ రాయడం కాదు. ఒక కోచ్ మిమల్ని పరీక్షించినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి కూర్చొని నేను మళ్లీ ఆడను అంటారా? ఒక ఆటగాడిగా నేనైతే ఛాలెంజ్ స్వీకరించి ఎదుర్కొంటా. అప్పుడు నా కోచ్ చెప్పిన మాటలు తప్పని నిరూపించుకుంటా. ఒకవేళ కుల్దీప్ పై నేను చేసిన వ్యాఖ్యలకు అశ్విన్ బాధపడి ఉంటే అందుకు నేను.. సంతోషిస్తున్నా. దానివల్లే మళ్ళీ అతడు సాధన చేసి తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు, అని మాజీ కోచ్ అభిప్రాయపడ్డాడు.

అయితే, ఆ టెస్టు తర్వాత కుల్దీప్ మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేక జట్టులో చోటు కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. ఇంకోవైపు అశ్విన్ తన ఆటను మెరుగుపర్చుకొని జట్టులో నెం. 1 స్పిన్నర్ గా నిలిచాడు. ఇటీవల టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా ఉన్న హర్భజన్ సింగ్ (417 వికెట్లు) రికార్డును కూడా అధిగమించాడు అశ్విన్. ప్రస్తుతం 427 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్ రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ లో మరో 8 వికెట్లు పడగొడితే కపిల్ దేవ్ (434)ను కూడా దాటిపోతాడు. అప్పుడు 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకునే అరుదైన అవకాశం అశ్విన్ ముందుంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twelve =