మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోన్న డ్రాగన్ కంట్రీ

Once again the China is terrorizing the world,Once again the China is terrorizing,China is terrorizing the world,Mango News,Mango News Telugu,China,8 new viruses, dragon country, terrorizing the world, Some Chinese scientists, viruses in Hainan,Remarks by President Biden,Chinas long game in West Asia,China Map Brandishing Territorial Stance,China is terrorizing Latest News,China is terrorizing Latest Updates
China,8 new viruses, dragon country, terrorizing the world, Some Chinese scientists, viruses in Hainan.

చైనా నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించిన విషయాన్ని కలలో కూడా ఎవరూ మరిచిపోలేరు. కంటికి కనిపంచని ఆ కరోనా రక్కసి కళ్ల ముందే ఎన్నో ప్రాణాలను తనతో తీసుకుపోయింది.  ప్రపంచం మొత్తాన్ని స్థంభించిపోయేలా చేస్తూ.. అన్ని రంగాలపై ప్రభావం చూపిన కరోనా వైరస్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా అంతా ఉలిక్కిపడతారు. అయితే వెలుగులోకి వచ్చిన ఓ వార్త మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది.

అవును చైనాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు హైనాన్‌లో ఎనిమిది కొత్త రకం వైరస్‌లను గుర్తించారట. ఇప్పుడు ఈ వార్తతో ప్రపంచంలో మళ్లీ అలజడి రేపుతోంది. అంతేకాదు ఈ వైరస్‌ జాతులకు వెంటనే అడ్డుకట్ట వేయకపోతే మనుషులకు సోకే ప్రమాదం ఉందని చైనా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు.. చైనా గవర్నమెంట్ నిధులు సమకూరుస్తోంది.  ఈ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన వివరాలను..  వైరోలాజిక సినికా అనే జర్న్‌లో ప్రచురితమయ్యాయి. ఎలుకల నుంచి సేకరించిన షాంపిల్స్‌లో.8 కొత్త రకం వైరస్‌లను  శాస్త్రవేత్తలు  గుర్తించినట్లు అధ్యయనం తెలిపింది.

చైనా గవర్నమెంట్ చేపట్టిస్తోన్న ప్రాజెక్టులో బాగంగా.. శాస్త్రవేత్తలు 2019 నుంచి 2021 మధ్య హైనాన్‌లో ఉన్న ఎలుకల నుంచి 682కిపైగా గొంతులోని నమూనాలను సేకరించి ల్యాబ్‌రేటరీలో పరీక్షించారు. ఈ పరీక్షల్లోనే  కొత్తగా 8 వైరస్‌ల ఉనికి ఉన్నట్లుగా చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ 8 వైరస్‌లలో బీటా కోరోనావైరస్ అనే..కోవిడ్ 19 వైరస్ కుటుంబానికి చెందిన వైరస్‌ కూడా ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఈ ఎలుకల్లో కరోనా వైరస్‌లు, ఫ్లేవి వైర్‌లు, పార్వో వైరస్‌లు, ఆస్ట్రో వైరస్‌లు కూడా ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాదు జాండిస్, డెంగ్యూకి కారణమయ్యే కొత్త వైరస్‌లు కూడా ఎలుకల్లో ఉన్నట్లు వీరి పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు.అలాగే ఈ ఎలుకల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన పార్వో వైరస్‌లు మనుషుల్లో ఫ్లూ, అర్థరైటీస్‌‌కు దారి తీస్తాయని అధ్యయనం తెలిపింది. అంతేకాదు చర్మం, శ్లేష్మ పొరల్లో నిరంతర ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే 2 పాలిల్లోమా వైరస్‌లను కూడా శాస్త్రవేత్తలు  గుర్తించారు. పొడవాటి టెయిల్ కలిగిన ఎలుక జాతుల్లో.. కొత్త ఫ్లేవి వైరస్‌, పార్వో వైరస్‌లు ఉన్నాయని  శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఎలుకల నుంచి  ఈ వైరస్‌లు మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వెంటనే వీటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని లేదంటే ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలను చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =