గద్వాల్ కోటపై జేజమ్మ జెండా ఎగురుతుందా?

Is The Jejamma Flag Flying Over Gadwal Fort,Is the Jejamma Flag flying,Jejamma Flag flying over gadwal,flying over gadwal fort,Mango News,Mango News Telugu,Telangana Assembly Elections, dk aruna, bjp,Jejemma flag on Gadwal fort,Jejamma Flag Latest News,Jejamma Flag Latest Updates,Jejamma Flag Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News
telangana assembly elections, dk aruna, bjp,

తెలంగాణ ఫైర్ బ్రాండ్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు డీకే అరుణ. కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. సమయం దొరికినప్పుడల్లా.. కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి బరిలోకి దిగేందుకు డీకే అరుణ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా గద్వాల్ కోటపై తన జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజవవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎంత ప్రచారం చేసినప్పటికీ జేజమ్మను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

2004లో గద్వాల్ నుంచి సమాజ్ వాదీ పార్టీ తరుపున.. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించారు డీకే అరుణ. మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన డీకే అరుణ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమినిచవిచూశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ తరుపున గద్వాల్ నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణ సిద్ధమవుతున్నారు.

అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఇప్పటి వరకు గద్వాల్‌లో బీజేపీ పార్టీ గెలుపొందిన దాఖలాలే లేవు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో చాలా మంది ప్రజలకు అసలు కమలం గుర్తంటేనే తెలియదట. అసలు బీజేపీ క్యాడరేలేదక్కడ. అంతేకాకుండా ఆ ప్రాంత ప్రజలు కూడా డీకే అరుణ ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని భావిస్తున్నారట. గతంలో మూడు సార్లు కాంగ్రెస్ నుంచి గెలుపొందడంతో పాటు.. వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేయడంతో.. ఇంకా డీకే అరుణ కాంగ్రెస్‌లోనే ఉన్నారని అక్కడి ప్రజలు అనుకుంటున్నారట.

ఈ పరిణామాల మధ్య డీకే అరుణను గెలుపు కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రామ గ్రామం తిరుగుతూ తాను బీజేపీ పార్టీలో చేరానని.. ఆ పార్టీ నుంచే పోటీ చేస్తున్నానని అరుణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కమలం పువ్వును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య గద్వాలలో కమలం పువ్వు వికసిస్తుందా?.. డీకే అరుణ వ్యూహాలు ఫలిస్తాయా?.. డీకే అరుణకు ప్రజలు పట్టం కడుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =