పర్సనల్ లోన్ తీసుకోవడం బెటరా.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రుణం మంచిదా?

Personal Loan Vs Loan Against Fixed Deposit Which One is The Better Choice,Personal Loan Vs Loan Against Fixed Deposit,Which One is The Better Choice,Loan Against Fixed Deposit,Personal Loan,Mango News,Mango News Telugu,FD Loan, personal loan,Public Sector Bank SBI, Is taking a personal loan better, Is a fixed deposit loan better,Unsecured Loan,Personal Loan Latest News,Personal Loan Vs Fixed Deposit

చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్‌ తీసుకుంటూ ఉంటారు. ఎంతో మంది పర్సనల్,హోమ్ లోన్లను తీసుకుంటారు. అయితే వీరిలో చాలామందికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా రుణం పొందొచ్చన్న విషయం తెలియదు. అవును.. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మనం జమ చేసిన మొత్తంపై 80 శాతం నుంచి 90 శాతం వరకూ కూడా బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవచ్చు.

అయితే దీనిపై ఈ మధ్యనే అందరిలో అవగాహన పెరగడంతో.. ఈ మధ్య కాలంలో ఎఫ్‌డీపై లోన్ కోసం డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తాజాగా ఆర్బీఐ తెలిపిన డేటా ప్రకారం.. జులై 1, 2022న బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌పై లోన్ రూ. 82,252 కోట్లు ఉండగా.. ఇది 2023 జూన్ 30కి.. రూ.1,20,427 కోట్లకు పెరిగిందట. అంటే ఒక ఏడాదిలో ఎఫ్‌డీపై అప్పు 46 శాతం కంటే ఎక్కువ పెరిగిందని ఆర్బీఐ చెబుతోంది. వడ్డీ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎఫ్‌డీ లోన్ ఆప్షన్‌నే అంతా ఎంచుకుంటున్నారు.

మే 2022నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ.. రెపో రేటును రికార్డు స్థాయిలో 2.5 శాతం పెంచింది. దీని వల్ల అన్ని రకాల రుణాలు చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. ప్రధాన బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పర్సనల్ లోన్స్‌పై ఒక ఏడాదికి 11 నుంచి 22 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. అలాగే, పర్సనల్ రుణాలపై రెండు నుంచి మూడు శాతం ప్రాసెసింగ్ ఫీజులు అదనంగా వసూలు చేస్తారు. జనరల్‌గా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే.. పర్సనల్ లోన్‌పై ఇచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

నిజానికి వ్యక్తిగత రుణం అనేది అన్ సెక్యూర్డ్ లోన్. ఎందుకంటే రికవరీ ప్రమాదం ఎక్కువగా ఉండటంతో దీనిలో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై రుణం మాత్రం సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కిందకు వస్తుంది. అందుకే దీనిలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. పైగా బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజులు వసూలు చేయవు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లోన్‌పై అదనంగా ఎలాంటి రుసుములు ఏమీ ఉండవు.

ఎఫ్‌డీ రుణాలపై బ్యాంకులు తక్కువ రేట్లు వసూలు చేస్తాయి. ఎఫ్‌డీ లోన్‌లో ఇచ్చే ఇంట్రస్ట్‌తో పోలిస్తే బ్యాంకులు సాధారణంగా ఈ లోన్ పై 0.5 నుంచి 2% ఎక్కువ ఇంట్రస్ట్‌నే వసూలు చేస్తాయి. అంటే ఎఫ్‌డీపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా పర్సనల్ లోన్లపై ఇచ్చే లోన్ పై ఎక్కువ వడ్డీని తీసుకుంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే రాబడితో పోలిస్తే.. దేశంలోని అతిపెద్ద గవర్నమెంట్ సెక్టార్ అయిన ఎస్‌బీఐ ఒక శాతం ఎక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఉదాహరణకు మీరు మీ ఎఫ్‌డీపై 6.5 శాతం వడ్డీని పొందుతున్నట్లయితే, బ్యాంకు రుణంపై 7.5 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అదేవిధంగా ఎఫ్‌డీపై లోన్ తీసుకోవడం ఈజీ కూడా.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఎటువంటి టైమ్ ఉండదు. అయితే ఎఫ్‌డీ మెచ్యూర్ అయ్యేలోపు ఈ రుణాన్ని చెల్లించమని బ్యాంకలు అడగవచ్చు. ఒకవేళ మీరు ఈ లోన్ తిరిగి చెల్లించలేనట్లయితే.. ఎఫ్‌డీ మెచ్యూరిటీ అయ్యాక బ్యాంక్ మీ మొత్తం లోన్ హ్యాండోవర్ చేసుకుంటుంది. మిగిలిన డబ్బులను బ్యాంక్ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + seventeen =