అనుచరులతో వంగవీటి రాధా సమావేశం.. జనసేనలో చేరికపై కీలక నిర్ణయం?

Vangaveeti Radha Held Meeting With Key Followers Likely To Join Janasena Party in Soon,Vangaveeti Radha Held Meeting,Meeting With Key Followers,Vangaveeti Radha To Join Janasena Party in Soon,Mango News,Mango News Telugu,Vangaveeti Radha,Vangaveeti Radha's meeting with followers, joining Janasena, Janasena,TDP, YCP, BJP, AP POLITICS,Vangaveeti Radha Latest News,Vangaveeti Radha Latest Updates,Vangaveeti Radha Live News,Janasena Party,Janasena Party Latest News,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

విజయవాడ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వంగవీటి రాధా రాజకీయంగా తన నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయటం ఆసక్తి కరంగా మారుతోంది. రాధా సోదరి పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో రాధా జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీపై రాధా ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

వంగవీటి రాధా తన అనచరులతో సమావేశం కానుండటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. 2019 ఎన్నికల వేళ వైసీపీని వీడిన వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లొ సీటు దక్కలేదు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పినా అమలు కాలేదు. కొంత కాలంగా రాధాను జనసేన చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయి.

నాదెండ్ల మనోహర్ నేరుగా రాధాతో సమావేశం అయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి రాధా పోటీ చేశారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ రాధా తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి.. నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

వంగవీటి రాధా సోదరి సైతం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు రాధా టీడీపీలో కొనసాగినా.. ఆయన కోరగానే విజయవాడ సెంట్రల్ సీటు దక్కే అవకాశం లేదు. అక్కడ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమాకు ఇప్పటికే హామీ దక్కినట్లు చెబుతున్నారు.

టీడీపీ, జనసేన పొత్తులో పవన్ పట్టుబడితే మినహా జనసేనలో చేరినా రాధాకు ఆ సీటు కేటాయించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. రాధాను ఆహ్వానించేందుకు ఆ విధమైన హమీ ఇచ్చేందుకు జనసేన నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అటు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగినా.. రాధా ప్రస్తుతం జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయినా జనసేన నేతగా ఉండటానికే రాధా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు సాధ్యం కాకుంటే ఏం చేయాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్య అనుచరులకు రాధా ఆహ్వానం పంపటంతో.. వారితో ప్రస్తుత రాజకీయాలపై చర్చ..రాజకీయంగా ఉన్న అవకాశాలపై చర్చించి వారి అభిప్రాయాలు సేకరిస్తారని తెలుస్తోంది. ఆ తరువాత రాధా తాను టీడీపీలో కొనసాగటమా, మరో పార్టీలో చేరటమా అనే అంశంపై క్లారిటీ ఇస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =