రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పినరయి విజయన్

Pinarayi Vijayan Sworn in as Chief Minister of Kerala State for the Second Time,Mango News,Mango News Telugu,Pinarayi Vijayan Takes Oath As Kerala Chief Minister For Second Time,Pinarayi Vijayan,Pinarayi Oath Taking Ceremony,Kerala CM Pinarayi Vijayan,Pinarayi Vijayan Oath Speech,Pinarayi Vijayan Takes Oath,Pinarayi Vijayan Speech,Pinarayi Vijayan Chief Minister,Pinarayi Vijayan Oath Taking Ceremony,Pinarayi Vijayan Sowrn In Ceremony,Swearing In Ceremony Of Pinarayi Vijayan,CM Pinarayi Vijayan Oath Taking Ceremony,Pinarayi Vijayan Sworn In As Chief Minister of Kerala,Kerala,Kerala News,Kerala CM,Pinarayi Vijayan Live,Pinarayi Vijayan Latest News,Pinarayi Vijayan Live Updates,Kerala CM Pinarayi Vijayan To Sworn In As CM For Second Time,Pinarayi Vijayan To Sworn In As CM of Kerala

కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం కేరళలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పినరయి విజయన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉండడంతో అన్ని కోవిడ్ ప్రొటొకాల్స్ పాటిస్తూ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పినరయి విజయన్ తో పాటుగా 21 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

ముందుగా ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) 140 అసెంబ్లీ స్థానాలకు గానూ, 99 స్థానాల్లో స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఎం పొలిట్ బ్యూరో నేత పినరయి విజయన్ వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఈసారి మంత్రివర్గం విషయంలో పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారికెవరికి ఈసారి మంత్రి పదవులు ఇవ్వలేదు. పూర్తిగా కొత్తవారినే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా సమర్థవంతంగా సేవలు అందించిన కేకే శైలజను తప్పించడంపై విమర్శలు వచ్చాయి. పూర్తిగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలోనే ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదని సీపీఎం నేతలు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =