బ్లాక్ ఫంగస్ వ్యాధిని నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Declared Black Fungus as Notifiable Disease,Mango News Telugu,Telangana Declares Black Fungus As Notifiable,Mucormycosis,Telangana Declares Black Fungus Disease As Notifiable,Black Fungus,Black Fungus In Telangana,Black Fungus Treatment,Telangana Declares Black Fungus A Notified Disease,Telangana Declares Black Fungus,Telangana Black Fungus,TS Declares Black Fungus As Notifiable Disease,Telangana Govt Declares The Disease As Notifiable,Telangana Declares Black Fungus An Epidemic,Telangana Declares Mucormycosis As Notifiable Disease,Telangana Declared Mucormycosis As A Notifiable,Telangana Govt Declares Black Fungus Mucormycosis As Notifiable

కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎపిడెమిక్ డిసీజెస్ ఆక్ట్ 1897 కింద మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అనే వ్యాధిని నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాధికి సంబంధించి స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్స విషయంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కేంద్ర ఆరోగ్యశాఖ మరియు ఐసీఎంఆర్ జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు ఇచ్చారు.

అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల మెడికల్ సూపెరింటెండెంట్స్ ప్రతి రోజూ ఈ వ్యాధికి సంబందించిన అనుమానిత మరియు నిర్ధారణ కేసుల సమాచారాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − sixteen =