భారత్ తో చివరి రెండు టెస్టులకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు

Australia Announces 18 Member Test Squad For Last 2 Tests Against India,India vs Australia 3rd Test,Australia Drop Joe Burns Bring Back Warner In Fold Along With Pucovski,David Warner,Will Pucovski,Joe Burns,Australia,Ind Vs Aus,Cricket,Ind Vs Aus News,IND Vs AUS,Mango News,Mango News Telugu,India Vs Australia 3rd Test Australia Drop Joe Burns Bring Back David Warner,Ind Vs Aus 2020,Ind Vs Aus 2021,India Vs Australia 3rd Test 2021,India Vs Australia 4th Test,Australia vs India series,India Vs Australia Test series,Australia Announces 18 Member Test Squad,Last 2 Tests Against India,Australia,India

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ఇప్పటికి‌ 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ జనవరి 7 నుంచి సిడ్నీలో, నాలుగో టెస్ట్ జనవరి 15 నుంచి బ్రిస్బేన్ లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టెస్టులకు భారత్ తో తలపడబోయే ఆస్ట్రేలియా జట్టు కోసం 18 మంది ఆటగాళ్లతో కూడా స్క్వాడ్ ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జరిగిన రెండు టెస్టులకు గాయాలతో జట్టుకు దూరమైన డేవిడ్ వార్నర్‌, విల్‌ పకోస్కీ, సీన్ అబాట్‌ లను చివరి రెండు టెస్టులకు ఎంపిక చేశారు. అలాగే రెండు టెస్టుల్లో ఓపెనర్ స్థానంలో ఆశించినంతగా రాణించని‌ జో బర్న్స్‌ ను జట్టునుంచి తొలగించారు.

చివరి రెండు టెస్టులకు ఎంపిక చేయబడిన ఆసీస్ ఆటగాళ్ల జాబితా ఇదే:

 1. టిమ్‌ పైన్ (కెప్టెన్‌)
 2. పాట్ కమ్మిన్స్ (వైస్ కెప్టెన్)
 3. సీన్ అబాట్‌
 4. కెమరూన్ గ్రీన్
 5. హేజిల్‌వుడ్‌
 6. మార్కస్ హారిస్‌
 7. ట్రేవిస్‌ హెడ్
 8. హెన్రిక్స్‌
 9. లబుషేన్
 10. నాథన్ లియాన్
 11. మైకేల్‌ నెసర్‌
 12. జేమ్స్ ప్యాటిన్సన్‌
 13. విల్‌ పకోస్కీ
 14. స్టీవ్ స్మిత్
 15. స్టార్క్
 16. స్వేప్సన్
 17. మాథ్యూ వేడ్‌
 18. డేవిడ్ వార్నర్‌
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here