రైతులతో చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం

2021 Budget session, Agendas For Budget Session, All-party Meeting, Budget Session, Budget session 2021, Budget session of Parliament, Farmers Protest, Mango News, Narendra Modi, Parliament Budget Session, Pm all-party meeting, PM Modi All-party Meeting, PM Modi Chaired a All-Party Meeting, PM Modi Chaired a All-Party Meeting On Farmers Protest, PM Modi Chaired a All-Party Meeting Today, pm narendra modi

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 30, శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీలో రైతుల చేస్తున్న ఆందోళనపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాల సమస్యను ప్రభుత్వం ఓపెన్‌ మైండ్‌ తోనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

రైతులతో చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం:

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు ఇచ్చిన ఏడాది పాటు కొత్త సాగు చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదన ఇప్పటికీ ఉందని అన్నారు. రైతులతో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కేవలం ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. జనవరి 26 న జరిగిన దురదృష్టకర సంఘటనలపై చట్టం తనదైన మార్గంలో చర్యలు తీసుకుంటుందని ప్రధాని చెప్పారు. సమావేశంలో పలు పార్టీల నాయకులు లేవనెత్తిన అంశాలపై సవివరమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని అన్నారు. పార్లమెంటు సజావుగా పనిచేయడం మరియు సభలో కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరగాల్సి ఉందని చెప్పారు. సభలో తరచూ అంతరాయాలు ఏర్పడుతుంటే చిన్న పార్టీలు తమ సమస్యలను సరిగ్గా వ్యక్తపరచలేక బాధపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం, భవిష్యతులో అనేక రంగాలలో ప్రపంచం మంచి కోసం భారతదేశం పోషించగల పాత్రను ప్రధాని మోదీ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 16 =