మహారాష్ట్ర సంక్షోభం: నేడు గవర్నర్‌తో భేటీ కానున్న శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్‌ షిండే! ఆయన వెంట 40 మంది ఎమ్మెల్యేలు?

Maharashtra Crisis Shiv Sena Rebel Minister Eknath Shinde To Meet Governor Today with 40 MLAs, Maharashtra Political Crisis Shiv Sena Rebel Minister Eknath Shinde To Meet Governor Today with 40 MLAs, Shiv Sena Rebel Minister Eknath Shinde To Meet Governor Today with 40 MLAs, Minister Eknath Shinde To Meet Governor Today with 40 MLAs, Eknath Shinde To Meet Governor Today with 40 MLAs, Governor, 40 MLAs, Maharashtra Crisis, Shiv Sena Rebel Minister Eknath Shinde, Shiv Sena Minister Eknath Shinde, Shiv Sena Rebel Minister, Minister Eknath Shinde, Eknath Shinde, Maharashtra Political Crisis News, Maharashtra Political Crisis Latest News, Maharashtra Political Crisis Latest Updates, Maharashtra Political Crisis Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర రాజకీయాలలో ఏర్పడిన సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతూ యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంటోంది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పూర్తికాలం పాలిస్తుందా లేక మధ్యలోనే కాడి వదిలేస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. పార్టీ కీలక నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే రెబెల్ గా మారడంతో ఖంగుతిన్న శివసేన ప్రస్తుత పరిస్థితిపై ఒక అంచనాకు రాలేకపోతున్నది. ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ షిండే తన వెంట మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించడం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేడు అత్యవసర మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ముందుగా 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం గుజరాత్‌లోని సూరత్‌ వెళ్లిన ఏక్‌నాథ్‌ షిండే నిన్న రాత్రికి తన శిబిరాన్ని అసోంకు తరలించారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటి విమానాశ్రయానికి చేరుకున్న షిండే ఈరోజు మహారాష్ట్రలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకు 40 మంది మద్దతు తెలుపుతున్నారని ప్రకటించిన ఆయన వారితో నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ 40 మందిలో 33 మంది శివసేన ఎమ్మెల్యలు, మరో ఏడుగురు స్వంతంత్రులు ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇది శివసేన పార్టీ అంతర్గత వ్యవహారం అని పైకి చెబుతున్నప్పటికీ తేడా వస్తే తమ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నందున తమ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక చర్చలు జరుపుతున్నారు.

ఇక ఈ వ్యవహారంలో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు బలంగా వినిపిస్తోంది. దీనివెనుక ఆయన ఉన్నారని శివసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తోంది. ఈ తరుణంలో అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్ మార్క్ చేరడానికి బీజేపీ ప్రయత్నించనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎంవీఏ కూటమికి 152 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో శివసేనకు 55, ఎన్సీపీకు 53, కాంగ్రెస్‌కు 44 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష బీజేపీకి 135 మంది సభ్యులు ఉన్నారు. అయితే షిండే తనతో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించిన నేపథ్యంలో ఎంవీఏ బలం 112కు పడిపోనుంది. ఈ క్రమంలో వారంతా బీజేపీకి మద్దతిస్తే.. ఆ పార్టీ తన బలాన్ని 175కు పెంచుకోవడంతో పాటు సులువుగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + five =