తమిళనాడులో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు

10th Class Exams, Govt Cancels Public Exams for 10th Standard, Promote 10th Class All Students, SSC exams, SSC Exams News, SSC Exams Updates, Tamil Nadu 10th Class Exams, Tamil Nadu Government, Tamil Nadu Govt Cancels Public Exams for 10th Standard, Tamil Nadu Promoted Students to the Next Class

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. విద్యార్థులందరిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తామని ప్రకటించారు. గతంలో నిర్వహించిన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల నుంచి 80 మార్కులు, హాజరు శాతాన్ని బట్టి 20 శాతం మార్కులను కేటాయించనున్నట్టు సీఎం తెలిపారు. ముందుగా జూన్ 15 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా, తాజాగా ఆ జాబితాలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కూడా చేరాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =