తుమకూరులో హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

PM Modi Dedicated Hindustan Aeronautics Limited Helicopter Factory to the Nation in Tumakuru Today,PM Modi Dedicated,Hindustan Aeronautics Limited,Helicopter Factory to the Nation,Helicopter Factory Tumakuru,Mango News,Mango News Telugu,Hindustan Aeronautics Limited Recruitment,Hindustan Aeronautics Limited Is Private Or Government,Hindustan Aeronautics Limited Bangalore,Hindustan Aeronautics Limited Chairman,Hindustan Aeronautics Limited Nashik,Hal Branches In India,Hal Ceo,Hindustan Aeronautics Limited Locations,Hindustan Aeronautics Limited Subsidiaries,Hindustan Aeronautics Limited Share Price,Hindustan Aeronautics Limited Ipo,Hindustan Aeronautics Limited Share Price Bse,Hindustan Aeronautics Limited Lucknow,Hindustan Aeronautics Limited Bangalore Address,Hindustan Aeronautics Limited News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత మధ్యాహ్నం తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా హెలికాప్ట‌ర్ ఫెసిలిటీ అండ్ స్ట్ర‌క్చ‌ర్ హ్యాంగ‌ర్‌ను ప్రధాని ప‌రిశీలించి, లైట్ యుటిలిటీ హెలికాప్ట‌ర్‌ (ఎల్యూహెఛ్) ను ఆవిష్కరించారు. అనంతరం తుమకూరు ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌, తుమకూరులోని తిప్తూరు, చిక్కనాయకనహళ్లిలో రెండు జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

అక్కడ ఏర్పాటు చేసిన స‌భలో ప్రజలనుద్దేశించి ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, క‌ర్ణాట‌క స‌న్యాసులు మరియు ఋషుల భూమి అని అన్నారు. వారు ఆధ్యాత్మికత, విజ్ఞానం మరియు వైజ్ఞానిక విలువలతో కూడిన భారతీయ సంప్రదాయాలను ఎల్లప్పుడూ బలోపేతం చేశారన్నారు. తుమకూరు యొక్క ప్రత్యేక ప్రాముఖ్యతను మరియు సిద్దగంగ మఠం యొక్క సహకారాన్ని కూడా ప్రధాని హైలైట్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ సమాజం మరియు మహిళల జీవన సౌలభ్యం, సాయుధ బలగాల పటిష్టత మరియు మేడ్ ఇన్ ఇండియా భావనకు సంబంధించి వందల కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను నేడు అంకితం చేయడం లేదా శంకుస్థాపన చేయడం జరిగిందని ప్రధాని అన్నారు. క‌ర్ణాట‌క యువ‌త‌లోని ప్ర‌తిభ‌ను, ఆవిష్క‌ర‌ణ‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు, డ్రోన్‌ల నుండి తేజ‌స్ ఫైట‌ర్ విమానాల వ‌ర‌కు ఉత్ప‌త్తుల‌లో ఉత్పాద‌క రంగం ప‌టిష్టత ప్ర‌క‌టించ‌బ‌డిందని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కర్నాటకను పెట్టుబడిదారుల మొదటి ఎంపికగా మార్చిందని చెప్పారు. రక్షణ అవసరాల కోసం విదేశీపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రతిజ్ఞతో 2016లో హెచ్‌ఏఎల్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు.

ఈ రోజు సాయుధ బలగాలు ఉపయోగిస్తున్న వందలాది ఆయుధాలు మరియు రక్షణ పరికరాలు భారతదేశంలో తయారవుతున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. అధునాతన అసాల్ట్ రైఫిల్స్ నుండి ట్యాంకులు, విమాన వాహక నౌకలు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్‌లు, రవాణా విమానాల వరకు అన్నింటినీ భారతదేశం తయారు చేస్తోందన్నారు. ఏరోస్పేస్ రంగం గురించి మాట్లాడుతూ, గత 8-9 ఏళ్లలో ఈ రంగంలో చేసిన పెట్టుబడులు 2014కి ముందు 15 సంవత్సరాలకు ముందు పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు ఎక్కువ అని చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు కేవలం మన సాయుధ బలగాలకు మాత్రమే సరఫరా చేయబడలేదని, 2014కి ముందు సంవత్సరాలతో పోల్చితే రక్షణ ఎగుమతులు కూడా అనేక రెట్లు పెరిగాయన్నారు. వందలాది హెలికాప్టర్‌లను హెఛ్ఏఎల్ యూనిట్ లో తయారు చేయబోతున్నామని, సమీప భవిష్యత్తులో ఇది 4 లక్షల కోట్ల విలువైన వ్యాపారాలకు దారి తీస్తుందని అన్నారు. ఇటువంటి తయారీ యూనిట్లు స్థాపించబడినప్పుడు, అది సాయుధ బలగాలను బలోపేతం చేయడమే కాకుండా ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. తుమకూరులోని హెలికాప్టర్ తయారీ కేంద్రం సమీపంలోని చిన్న వ్యాపారాలు సాధికారత పొందుతాయన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే స్ఫూర్తితో విజయం సాధించడం ఖాయమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

తుమకూరులో హెచ్‌ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ, హెలికాప్టర్‌లను నిర్మించే సామర్థ్యాన్ని మరియు పర్యావరణ వ్యవస్థను పెంపొందించే ప్రత్యేక కొత్త గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈ హెలికాప్టర్ ఫ్యాక్టరీ ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం మరియు మొదట లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను (ఎల్యూహెఛ్) ఉత్పత్తి చేస్తుంది. ఎల్యూహెఛ్ అనేది దేశీయంగా రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన 3-టన్ క్లాస్, ఒకే ఇంజన్ బహుళార్ధసాధక యుటిలిటీ హెలికాప్టర్. లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్సీహెఛ్) మరియు ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్హెఛ్) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి అలాగే భవిష్యత్తులో ఎల్సీహెఛ్, ఎల్యూహెఛ్, సివిల్ ఏఎల్హెఛ్ మరియు ఐఎంఆర్హెఛ్ యొక్క మరమ్మత్తు కోసం ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. భవిష్యత్తులో సివిల్ ఎల్యూహెఛ్ లను కూడా ఎగుమతి చేసే అవకాశం కూడా ఈ ఫ్యాక్టరీకి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =