ప్రముఖ పర్వతారోహకురాలు, సైక్లిస్ట్ ఆశా మాలవ్యను అభినందించిన సీఎం జగన్.. రూ.10 లక్షల ప్రోత్సాహకం అందజేత

AP CM YS Jagan Announces Rs 10 Lakh Incentive To Mountaineer and Cyclist Asha Malaviya,AP CM YS Jagan,Announces Rs 10 Lakh Incentive,Mountaineer and Cyclist,Asha Malaviya,Mango News,Mango News Telugu,Isha Malviya,Isha Malviya Age,Isha Malviya Instagram,Isha Malviya And Abhishek Kumar,Isha Malviya Age 2021,Isha Malviya Wikipedia,Isha Malviya Instagram Picuki,Isha Malviya Real Age,Isha Malviya Photos,Isha Malviya Birthday

ప్రముఖ సైక్లిస్ట్, పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సైకిల్‌పై దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంతో ఆశా మాలవ్య ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సహా 8 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 8 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు ఆమె సీఎం జగన్‌కు వివరించారు. దీంతో ఆశా మాలవ్య సంకల్పాన్ని అభినందించిన సీఎం జగన్, ఆమెకు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుంటన్నానని, మహిళల కోసం ఆశా మాలవ్య కృషి ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా నటారం గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 25,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − three =