అంబ్ అందౌరా-న్యూఢిల్లీ వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Flagged off Inaugural Run of New Vande Bharat Express from Amb Andaura Una to New Delhi, PM Modi Flagged off Inaugural Run, New Vande Bharat Express from Amb Andaura Una to New Delhi, New Vande Bharat Express, Vande Bharat Express from Amb Andaura Una to New Delhi, Mango News, Mango News Telugu, Mumbai-Gandhinagar, PM Modi To Launch Vande Bharat Express, PM Modi To Launch Vande Bharat Express Soon, IRCTC, Indian Railway Catering and Tourism Corporation, Indian Railway, Indian Railway Latest News And Updates, PM Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ఉనాలోని అంబ్ అందౌరా నుండి న్యూఢిల్లీ వరకు నడిచే కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ప్రవేశపెట్టిన నాల్గవ వందే భారత్ రైలుగా నిలిచింది. ముందుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లను, ఆన్‌బోర్డ్ సౌకర్యాలను ప్రధాని మోదీ పరిశీలించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లోకోమోటివ్ ఇంజన్ నియంత్రణ కేంద్రాన్ని మరియు ఉనా రైల్వే స్టేషన్‌ను కూడా ప్రధాని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటుగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

ఈ వందే భారత్ రైలును ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధి చెందుతుందని మరియు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ విధానాన్ని ప్రజలకు అందిస్తుందని తెలిపారు. ఉనా నుండి న్యూఢిల్లీకి ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గుతుందన్నారు. వందే భారత్ 2.0 కేవలం 52 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని మరియు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో చేరుకోవడం వంటి మరిన్ని పురోగతులు మరియు మెరుగైన ఫీచర్లను కలిగి ఉందని చెప్పారు.

అనంతరం ప్రధాని మోదీ ఉనాలో బహిరంగ సభలో పాల్గొని, ఉనా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని (ఐఐఐటీ) జాతికి అంకితం చేశారు. 2017లో ప్రధాని దీనికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో 530 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఉనా జిల్లాలోని హ‌రోలిలో 1900 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించ‌నున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేశారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏపీఐ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని, దాదాపు రూ.10,000 కోట్లు పెట్టుబడులను ఆకర్షిస్తుందని, 20,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అనంతరం చంబాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని హిమాచల్ ప్రదేశ్‌లో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటుగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన-3ని ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =