హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన దిసభ్య ధర్మాసనం

Karnataka Hijab Row Supreme Court Delivers Split Judgment Matter to be Placed Before CJI Lalit, Karnataka Hijab Ban, SC To Pronounce Verdict on Hijab Ban, Karnataka Hijab Row, Mango News, Mango News Telugu, Supreme Court Hijab Verdict Live Updates, Karnataka Hijab Row, Karnataka Hijab Row News And Live Updates, Split Verdict In Karnataka Hijab Ban Case, Hijab Ban Case, Hijab Ban In Karnataka, Karnataka Hijab Ban SC Verdict, SC Verdict On Karnataka Hijab Ban Today

కర్ణాటకలో వివాదాస్పదమైన హిజాబ్​ అంశంపై సుప్రీంకోర్టులో విచిత్ర పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినిల హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచార‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనిపై భిన్నాభిప్రాయాలు తెలిపారు. దిసభ్య ధ‌ర్మాస‌నంలోని ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు వేర్వేరు తీర్పులు ఇచ్చారు. హిజాబ్ నిషేధ ఆదేశాల‌ను ధ‌ర్మాస‌నంలోని ఇద్దరిలో ఒకరైన జ‌స్టిస్ హేమంత్ గుప్తా స్వాగ‌తించగా, మ‌రో న్యాయ‌మూర్తి సుధాన్షు దులియా మాత్రం ప్ర‌భుత్వ ఆదేశాల‌ను, కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ హిజాబ్ బ్యాన్​పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ‘అభిప్రాయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి’ అని జస్టిస్ గుప్తా తీర్పును ప్రకటించేటప్పుడు ప్రారంభంలోనే చెప్పడం విశేషం.

ఇక న్యాయమూర్తి ధులియా దీనిపై స్పందిస్తూ.. పాఠశాలలు మరియు కళాశాలల్లో సమానత్వం, సమగ్రత మరియు పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించే దుస్తులు ధరించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5, 2022 నాటి ఉత్తర్వులను రద్దు చేసినట్లు చెప్పారు. అంతిమంగా హిజాబ్ ధరించడం, మతపరమైన ఆచారాల భావన అని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 ప్రకారం కర్ణాటక హైకోర్టు తీర్పు చెల్లదని ధులియా స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం మరింత జఠిలమైంది. ఇక విభజన తీర్పును దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను మరొక సముచితమైన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని దిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా కర్ణాటకలోని ఉడిపిలో ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ గర్ల్స్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థినులలో ఒక వర్గం తరగతి గదులలో హిజాబ్ ధరించడానికి అనుమతి నిరాకరించడంతో ఈ విఅవ్వడం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =