ఉత్తరాఖండ్‌ లో పీఎం మోదీ, రూ.17500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన

Mango News, Nagina Kashipur National Highway, Narendra Modi, PM Modi, PM Modi inaugurates 23 projects, PM Modi launches projects in Uttarakhand, PM Modi launches projects worth 17500 crore in Uttarakhand, PM Narendra Modi, PM Narendra Modi inaugurates lays foundation stones of projects, PM Narendra Modi Inaugurates Multiple Projects, PM Narendra Modi Inaugurates Multiple Projects Worth Rs 17500 Crores, Prime Minister Of India, Uttarakhand, Uttrakhand

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్‌లో రూ.17500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. 1976లో తొలిసారిగా రూపొందించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న లఖ్వార్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు, రూ.8700 కోట్ల రోడ్ సెక్టార్ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ రహదారి ప్రాజెక్టులు మారుమూల, గ్రామీణ మరియు సరిహద్దు ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, అలాగే కైలాష్ మానస సరోవర్ యాత్రకు మెరుగైన కనెక్టివిటీ కూడా లభిస్తుందని చెప్పారు.

ఉధమ్‌సింగ్‌ నగర్‌లో ఎయిమ్స్‌ రిషికేశ్‌ శాటిలైట్‌ సెంటర్‌, పితోర్‌గఢ్‌లో జగ్జీవన్‌ రామ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ఉపగ్రహ కేంద్రాలు దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను అందించాలనే ప్రయత్నానికి అనుగుణంగా ఉంటాయన్నారు. కాశీపూర్‌లో అరోమా పార్క్, సితార్‌గంజ్ వద్ద ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ పార్క్, రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మరియు తాగునీటి సరఫరాలో అనేక ఇతర కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ప్రజల బలం ఈ దశాబ్దాన్ని ఉత్తరాఖండ్ దశాబ్దంగా మారుస్తుందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న ఆధునిక మౌలిక సదుపాయాలు, చార్ ధామ్ ప్రాజెక్ట్, కొత్త రైలు మార్గాలు నిర్మించడం వంటివి ఈ దశాబ్దాన్ని ఉత్తరాఖండ్ దశాబ్దంగా మార్చేందుకు దోహదపడుతుందన్నారు. జలవిద్యుత్, పరిశ్రమలు, పర్యాటకం, సహజ వ్యవసాయం మరియు కనెక్టివిటీ రంగాలలో ఉత్తరాఖండ్ సాధించిన ప్రగతిని ప్రధాని ప్రస్తావించారు. గతంలో కొండ ప్రాంతాల్లో అభివృద్ధి, సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ స్ఫూర్తితో పని చేస్తుందన్నారు. ఉధమ్‌సింగ్‌ నగర్‌లో ఎయిమ్స్‌ రిషికేశ్‌ శాటిలైట్‌ సెంటర్‌, పితోర్‌గఢ్‌లో జగ్జీవన్‌రామ్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేయడం వల్ల రాష్ట్రంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు మరింత పటిష్టం కానున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =