రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,

PM Modi Rahul Gandhi Priyanka Gandhi Pay Tribute to Rajiv Gandhi on his 78th Birth Anniversary, INC Rahul Gandhi PM Modi And Others Pay Tribute To Rajiv Gandhi On 78th Birth Anniversary, PM Modi And Others Pay Tribute To Rajiv Gandhi On 78th Birth Anniversary, INC Rahul Gandhi And Others Pay Tribute To Rajiv Gandhi On 78th Birth Anniversary, Tribute To Rajiv Gandhi On 78th Birth Anniversary, Rajiv Gandhi 78th Birth Anniversary, Tribute To Rajiv Gandhi, Rajiv Gandhi Tribute, 78th Birth Anniversary, INC Rahul Gandhi, PM Modi, Rajiv Gandhi Tribute News, Rajiv Gandhi Tribute Latest News And Updates, Rajiv Gandhi Tribute Live Updates, Mango News, Mango News Telugu,

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం ఢిల్లీలోని వీరభూమి వద్ద తమ తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాహుల్, ప్రియాంక నివాళులర్పించారు. అలాగే పార్టీ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ కేసీ వేణుగోపాల్, పలువురు పార్టీ నేతలు కూడా వీరభూమి వద్ద నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు నాయకులు ఆయనను స్మరించుకున్నారు.

ఇక రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తన తండ్రికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, “పాపా, మీరు నాతో ప్రతి క్షణం, నా హృదయంలో ఉన్నారు. దేశం కోసం మీరు కలలుగన్న కలను నెరవేర్చడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను” అని భావోద్వేగ పోస్టును పంచుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ, “జయంతి సందర్భంగా, మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =