రెండో వన్డేలో జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం, సిరీస్​ను కైవసం

India Beat Zimbabwe by 5 wickets in 2nd ODI Take 2-0 Lead in the Series, India Take 2-0 Lead in the Series, India Beat Zimbabwe by 5 wickets in 2nd ODI, India VS Zimbabwe 2nd ODI, India Beat Zimbabwe by 5 wickets, India VS Zimbabwe, India VS Zimbabwe ODI Series, Ind vs Zim 2nd ODI, India VS Zimbabwe 2nd ODI Highlights, Ind vs Zim 2nd ODI News, Ind vs Zim 2nd ODI Latest News And Updates, Ind vs Zim 2nd ODI Live Updates, Mango News, Mango News Telugu,

భారత్‌, జింబాబ్వే జట్ల మధ్య హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో రెండు మ్యాచ్ ల్లో విజయాలతో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ముందుగా భారత్‌ జట్టు టాస్ గెలవగా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈసారి కూడా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌ కు దిగిన జింబాబ్వే 38.1 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. జింబాబ్వే ఆటగాళ్లలో సీన్ విలియమ్స్ 42 పరుగులు, ర్యాన్ బూరి 39 పరుగులతో మాత్రమే రాణించారు. భారత్ బౌలర్ల విజృంభణతో 7 గురు జింబాబ్వే ఆటగాళ్లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. భారత్ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా ఒక్కో వికెట్ పడగొట్టాడు.

ఇక 162 పరుగుల లక్ష్య ఛేదనకై బరిలో దిగిన భారత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో 167 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (33), శుభ్​మన్​గిల్ (33), సంజు సాంసన్ (43), దీపక్ హుడా (25) పరుగులతో రాణించడంతో భారత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. కాగా కెప్టెన్ గా కేఎల్ రాహుల్ (1), ఇషాన్ కిషన్ (6) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. జింబాబ్వే బౌలర్లలో జోంగ్వే 2, చివాంగ, నూయాచి, సికిందర్ రాజా ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో రాణించిన సంజు సాంసన్ ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ఆగస్టు 22, సోమవారం నాడు జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 20 =