దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడంలో ఎంపీలంతా సహకరించాలి: ప్రధాని మోదీ

2022 Parliament Budget session, 2022 Union Budget, Budget session of Parliament, Budget Session of Parliament To Be Started, Budget Session of the Parliament 2022, Mango News, Mango News Telugu, Modi Suggestions to MPs Parties Ahead of Budget Session, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliament Budget Session Live Updates, Parliament Budget Session Start, Parliament Budget Session Updates, Parties Ahead of Budget Session of the Parliament 2022, PM Modi, PM Modi Suggestions to MPs, PM Modi Suggestions to MPs Parties Ahead of Budget Session of the Parliament 2022

పార్లమెంట్ బడ్జెట్-2022 సమావేశాలు జనవరి 31, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. “నేటినుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు ఎంపీలందరినీ నేను స్వాగతిస్తున్నాను. నేటి ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌ కు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ సెషన్ దేశ ఆర్థిక పురోగతి, భారతదేశం యొక్క టీకా కార్యక్రమం గురించి, భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ల గురించి ప్రపంచానికి నమ్మకాన్ని కలిగిస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ బడ్జెట్ సెషన్‌లో కూడా అనేక చర్చలు, పలు అంశాలు మరియు ఓపెన్ మైండెడ్ డిబేట్లు ప్రపంచ ప్రభావానికి ఒక ముఖ్యమైన అవకాశంగా మారనున్నాయి. ప్రజాప్రతినిధులందరూ, అన్ని రాజకీయ పార్టీలు దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడంలో, ముక్తకంఠంతో మంచి చర్చలు జరిపి దాన్ని వేగవంతం చేయడంలో తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నానని ప్రధాని అన్నారు. ఎన్నికల కారణంగా ఈ బడ్జెట్ సమావేశాలు మరియు చర్చలు ప్రభావితం అవుతున్నాయనేది నిజం. అయితే ఎన్నికలు వేరుగా ఉంటాయని, అవి కొనసాగుతాయని అర్థం చేసుకోవాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బడ్జెట్ సెషన్ మొత్తం సంవత్సరానికి బ్లూప్రింట్‌ను రూపొందిస్తుంది. పూర్తి నిబద్ధతతో ఈ బడ్జెట్ సెషన్‌ను మరింత ఫలవంతం చేస్తే, రాబోయే సంవత్సరం కూడా దేశాన్ని కొత్త ఆర్థిక శిఖరాలకు తీసుకెళ్లడానికి గొప్ప అవకాశంగా ఉంటుంది. స్వేచ్ఛగా, ఆలోచనాత్మక చర్చలు, మానవీయ భావాలతో కూడిన చర్చలు మంచి ఉద్దేశ్యంతో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =