దేశంలో 4 బీఎఫ్.7 వేరియంట్ కేసులు, కోవిడ్-19 పరిస్థితిపై నేడు ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

PM Modi To Chair High-level Meeting to Review the Covid-19 Situation and Related Aspects in the Country,4 BF7 Variant Cases, 4 BF7 Variant Cases Registered India,Prime Minister Modi High-Level Review,Situation Of Covid-19 India,Mango News,Mango News Telugu,BF7 Variant Cases,BF7 Variant Latest News and Updates,Omicron BF7 Symptoms,BF7 Variant Symptoms,BF7 Variant Severity,Omicron BF7 In India,BF7 Covid Variant,Ba 5 1 7 Variant,Omicron New Variant,Omicron New Variant In India,Omicron Bf.7 Symptoms,Bf.7 Variant Severity,Omicron Bf.7 In India,Ba 5.1 7 Variant,Bf.7 Variant,BF7 Variant In India,Bf.7 Variant Covid,Bf.7 Variant Cdc,Bf.7 Variant Canada,Bf.7 Variant Uk,Bf.7 Variant Belgium,Bf.7 Variant Mutations,Covid BF7 Variant,Omicron BF7 Variant,Covid BF7 Variant Symptoms

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం దేశంలో కోవిడ్-19 పరిస్థితి మరియు సంబంధిత అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, వైద్య శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ముందుగా చైనా, జపాన్, యూఎస్ఏ, బ్రెజిల్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా సహా పలు దేశాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్సాకాగ్ నెట్‌వర్క్ ద్వారా కొత్త కోవిడ్-19 వేరియంట్స్ ను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించాలని ఇటీవలే రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఎఫ్.7 దేశంలో కూడా వెలుగు చూసింది. దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో 3, ఒడిశా రాష్ట్రంలో ఒకటి సహా మొత్తం నాలుగు బీఎఫ్.7 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో బుధవారం కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా కోవిడ్-19పై ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన ప్రమాణాలు వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ప్రజలంతా రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించాలని సూచించారు. ప్రికాష‌న్ డోసు తీసుకోవాలని, ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఈ డోసు తప్పనిసరిగా తీసుకోవాల‌ని కోరారు. పెద్ద వయసు వారు, దీర్ఘకాల వ్యాధులు ఉన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని స్పష్టం చేశారు.

అలాగే దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చైనా మరియు ఇతర దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు విమానాశ్రయాలలో ర్యాండమ్ శాంపిల్ టెస్ట్స్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ పరిస్థితి, మరో వేవ్ రాకుండా సన్నద్ధత, అధికార యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం సహా పలు అంశాలపై నేడు ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 19 =