రేపటినుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ ఇదే

AP CM YS Jagan To Go For Three-Day Visit of YSR Kadapa District From Dec 23rd-25th,Cm Jagan Will Visit Kadapa District,Jagan 3 Days Tour,Jagan Complete Schedule,Kadapa District Collector 2022,Mango News,Mango News Telugu,Ysr District,Jagan Visit To Kadapa,Cm Jagan Tour,Jagan Kadapa Tour,Cm Jagan Padakalu,Jagan Kadapa,Cm Jagan News,Kadapa Airport Timings,Ys Jagan Kadapa Tour,Cm Jagan Kadapa Tour,Kadapa To Vizag Train Ticket Price,Vizag To Kadapa Flights Timings,Kadapa To Tirupati Ticket Price,Jadcherla To Kadapa Distance

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పర్యటనకు వెళ్ళనున్నారు. డిసెంబర్‌ 23 నుంచి 25 వరకు ఆయన కడప జిల్లాలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో పులివెందుల, ఇడుపులపాయల్లో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు హాజరవనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేయడంతో పాటు పులివెందుల పట్టణంలోని స్థానిక చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనకు పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కడప కలెక్టర్ వి. విజయరామరాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో ఎస్పీ అన్బు రాజన్, జాయింట్ కలెక్టర్ సి.ఎం. శ్రీకాంత్ శర్మ, డీఆర్వో గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే చోట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విజయరామరాజు సీఎం జగన్ పర్యటన వివరాలను వెల్లడించారు.

సీఎం జగన్ కడప జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..

డిసెంబర్ 23 పర్యటన వివరాలు

  • డిసెంబర్ 23వ తేదీన ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
  • అక్కడినుంచి 10.45 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు.
  • 11.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకుంటారు.
  • అక్కడ ప్రత్యేక ప్రార్థనల తర్వాత రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
  • అనంతరం 12:45కి బయలుదేరి ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి 12.50 గంటలకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
  • ఇక అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:15 నిమిషాలకు వైసీపపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు.
  • అనంతరం 1:25 గంటలకు బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకుంటారు.
  • 1:45 గంటలకు అక్కడినుంచి 2:05 గంటలకు కమలాపురం హెలీప్యాడ్ చేరుకుంటారు.
  • ఇక 2.15 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్న తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
  • 2:30 నుంచి 3.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
  • అనంతరం 4.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.
  • సాయంత్రం 5 గంటలకు రాత్రికి ఇడుపులపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అక్కడే బస చేస్తారు.

డిసెంబర్ 24 పర్యటన వివరాలు

  • డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9.00 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు.
  • 9:10 నుంచి 9:40 గంటల వరకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
  • అనంతరం 9:45 గంటలకు బయలుదేరి ఇడుపులపాయలోని చర్చిలో 10:00 నుంచి 12:00 గంటల వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు.
  • మధ్యాహ్నం 12.05 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని 12.15 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.
  • ఆ తర్వాత 12:40 గంటలకు పులివెందుల లోని భాకరాపురం హెలిపాడ్ చేరుకుంటారు.
  • 1:10నుంచి 1:20 వరకు విజయ హోమ్స్‌ జంక్షన్‌ను ప్రారంభిస్తారు.
  • 1:30 నుంచి 2:50 మధ్య కదిరి రోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డు, కూరగాయల మార్కెట్‌, మైత్రి లే అవుట్‌, రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు.
  • అనంతరం మధ్యాహ్నం 3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్‌ వైఎస్సార్‌ బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
  • ఆ తర్వాత 3:35 నుంచి 4:45 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులు, ఎంఎల్డీ ఎస్టీపీ, జేటీఎస్ లను ప్రారంభిస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు భాకరాపురం హెలిపాడ్ చేరుకొని 5:40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

డిసెంబర్ 25 పర్యటన వివరాలు

  • ఇక చివరిరోజు డిసెంబర్ 25వ తేదీన ఉదయం 8:40 గంటలకు బయలుదేరి 9:05 గంటలకు భాకరాపురం హెలిపాడ్ చేరుకుంటారు.
  • 9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు.
  • 10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • 11.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =