నేడు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు చేరువయ్యేందుకు అక్టోబర్ 3, 2014న మొదటిసారిగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆకాశవాణిలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా గత తొమ్మిదేళ్లుగా ఆయన ప్రతి నెలా చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం నేటితో 100వ ఎపిసోడ్ జరుపుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు. ప్రధాని మోదీతో కలిసి అమీర్ ఖాన్ పలువురు విద్యార్థులతో ముచ్చటించనున్నారు.

కాగా మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ తన మనసులోని మాటలనే కాకుండా.. తరుచుగా భారతదేశం అంతటా స్ఫూర్తిదాయకమైన కథనాలను పంచుకుంటుంటారు. ఈ కార్యక్రమం ప్రధానంగా.. వాతావరణం, పర్యావరణం, పరిశుభ్రత, వివిధ సామాజిక సమస్యల నుండి పరీక్షల వరకు అనేక అంశాలపై ఇది నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 500 మందికి పైగా భారతీయులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం మన్ కీ బాత్ 23 భారతీయ భాషలు మరియు 29 మాండలికాలలోకి అనువదించబడింది. ఇక మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.

కాగా మరోవైపు మన్ కీ బాత్‌ 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీకి శుభాభినందనలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ శనివారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ‘దేశ ప్రధాని దేశవాసులతో రేడియో మాధ్యమం ద్వారా స్వయంగా ముచ్చటించే ఈ కార్యక్రమం.. శ్రోతలకు, తదుపరి టీవీ ప్రసారాల్లో చూసే వీక్షకులకు ఎంతో చేరువైంది. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైన రేడియోలో వినడమో, టీవీలో చూడటమో జరిగింది. దీనిని ప్రతి నెలా సుమారు 23 కోట్ల మంది ఆదరిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించే అంశాలు చాలా విభిన్నంగా ఉంటున్నాయి. సామాన్యులు సాధించే విజయాలు, గొప్ప వ్యక్తులు, కళలు, చేతివృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు.. ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర చేశాయి’ అని జనసేనాని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 6 =