నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం ప్రారంభోత్సవం

CM KCR To Inaugurate Telangana New Secretariat Building Which Named After Dr BR Ambedkar Today,CM KCR To Inaugurate Telangana New Secretariat,Telangana New Secretariat Building,New Secretariat Named After Dr BR Ambedkar Today,Mango News,Mango News Telugu,New Telangana Secretariat Named,CM KCR to inaugurate new Secretariat,BR Ambedkar name for new secretariat,Telangana New Secretariat Latest News,Telangana New Secretariat News Updates,Telangana New Secretariat Live News

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ సమయంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం ఆరో అంత‌స్తులోని త‌న ఛాంబ‌ర్‌లో సీఎం కేసీఆర్ ఆశీనులు కానున్నారు. అలాగే మధ్యాహ్నం 1:58 గంట‌ల నుంచి 2:04 గంట‌ల మ‌ధ్య మంత్రులు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సహా ఇత‌ర ఉన్నతాధికారులు త‌మ ఛాంబ‌ర్ల‌లో ఆశీనులు అవ్వనున్నారు. కాగా నూతన సచివాలయం ప్రారంభోత్సవాన్ని మొదట ఫిబ్రవరి 17న నిర్ణయించినప్పటికీ, అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. దీంతో నేటినుంచి కొత్త సమీకృత పరిపాలనా భవనం పూర్తి స్థాయిలో ప్రారంభించబడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు ఇప్పటికే పరిశీలించారు.

ఇక కొత్త సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం సాగునీటి రంగంపైనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సీతారామ మరియు సీతమ్మ సాగర్‌ బహుళార్ధక సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించనున్నారు. ఇక కొత్త సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం సాగునీటి రంగంపైనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సీతారామ మరియు సీతమ్మ సాగర్‌ బహుళార్ధక సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఈ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు, రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌.. అలాగే ఆయా జిల్లాలకు చెందిన చీఫ్‌ ఇంజినీర్లు, ఎస్‌ఈలు తదితరులు పాల్గొననున్నారు.

నూతన సచివాలయ ప్రత్యేకతలివే..

కాగా 2019, జూన్‌ 27న సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేశారు. ఇండో-పర్షియన్‌ నిర్మాణ శైలిలో సకల వసతులతో నిర్మించిన ఈ భవనంపై రెండు డోమ్‌లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేయగా, సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు అన్నింటికన్నా ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న ఈ రెండు డోమ్‌లపై జాతీయ చిహ్నాలైన మూడు సింహాల బొమ్మలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు. ఇక సచివాలయ ప్రాంగణంలో 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వెడల్పుతో, హిందూ, దక్కనీ, కాకతీయ నిర్మాణ శైలుల మేళవింపు చేసి రెండు భారీ ఫౌంటెయిన్లను రెడ్‌ శాండ్‌స్టోన్‌తో నిర్మించారు. ఇక కట్టడం వెలుపల ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నీ ఎర్ర ఇసుక రాతితోను, మధ్యలోని బురుజు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇసుక రాతితోనూ నిర్మించారు. కాగా దీనిని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు డాక్టర్‌ ఆస్కార్‌ మరియు పొన్ని కాన్సెసావోలు డిజైన్‌ చేయడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 16 =