‘భారత్ డ్రోన్ మహోత్సవ్ -2022’ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi Inaugurates India's biggest Drone Festival in Delhi Today, PM Modi Starts India's biggest Drone Festival in Delhi Today, PM Narendra Modi Launches India's biggest Drone Festival in Delhi Today, PM Modi Inaugurated India's biggest Drone Festival in Delhi Today, India's biggest Drone Festival in Delhi, India's biggest Drone Festival, Drone Festival, India's biggest Drone Festival News, India's biggest Drone Festival Latest News, India's biggest Drone Festival Latest Updates, India's biggest Drone Festival Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

భారతదేశపు అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. డ్రోన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. 2014కు ముందు పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పట్ల ఉదాసీనత వాతావరణం నెలకొంది. దీని కారణంగా పేదలు, వెనుకబడినవారు, మధ్యతరగతి ప్రజలు చాలా నష్టపోయారని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ గురించి భారతదేశంలో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతంగా ఉందని, ఉపాధి కల్పనలో అభివృద్ధి చెందుతున్న రంగానికి సంబంధించిన అవకాశాలను ఇది సూచిస్తోందని అన్నారు.

డ్రోన్ టెక్నాలజీ ఎంత పెద్ద విప్లవానికి ప్రాతిపదికగా మారుతోందో చెప్పడానికి ప్రధానమంత్రి స్వామిత్వ యోజన ఒక ఉదాహరణ అని, దీని కింద మొదటిసారిగా గ్రామాల్లోని ప్రతి ఆస్తిని డిజిటల్ మ్యాపింగ్ చేసి ప్రజలకు డిజిటల్ ప్రాపర్టీ కార్డులను అందజేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, క్రీడలు, రక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతుందని మోదీ చెప్పారు. భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022′ మే 27 మరియు 28 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది. మోడీతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =