తెలంగాణలో 10,105 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి.. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

Telangana Ministry of Finance Issues Orders For The Job Notification Regarding 10105 Posts, Ministry of Finance Issues Orders For The Job Notification Regarding 10105 Posts, TS Ministry of Finance Issues Orders For The Job Notification Regarding 10105 Posts, Job Notification Regarding 10105 Posts, 10105 Posts, Telangana Ministry of Finance, Ministry of Finance, TS Health Minister T Harish Rao issues Notification Regarding 10105 Posts, Telangana notifies over 10105 more jobs across state, Finance department issued orders for recruitment to 10105 vacant posts, Telangana Ministry of Finance News, Telangana Ministry of Finance Latest News, Telangana Ministry of Finance Latest Updates, Telangana Ministry of Finance Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో శుభవార్త వినిపించింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలలోని మొత్తం 10,105 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా జీవో నంబర్‌ 83 నుంచి 97 వరకు మొత్తం 15 జీవోలను జారీ చేశారు. వీటిలో 9,096 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లోనే ఉన్నాయి. తాజాగా ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతితో ఇప్పటిదాకా మొత్తం 45,325 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లయింది. కాగా వీటిలో 20,391 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ జారీ అయింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం మొత్తం ఖాళీలు – 10,105

టీఆర్ఈఐఆర్బీ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు – 9,096

  • మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీలోని ఖాళీలు – 3,870
  • టీఎస్ డబ్ల్యూఆర్ఈఐ లోని ఖాళీలు – 2,267
  • సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలోని ఖాళీలు – 1,514
  • మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీలోని ఖాళీలు – 1,445

టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఖాళీలు – 995

  • ఎస్సీ కులాల అభివృద్ధి శాఖలోని ఖాళీలు – 316
  • మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఖాళీలు – 251
  • బీసీ సంక్షేమ శాఖలోని ఖాళీలు – 157
  • గిరిజన సంక్షేమ శాఖలోని ఖాళీలు – 78
  • దివ్యంగులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖలోని ఖాళీలు – 71
  • జువెనైల్ వెల్ఫేర్ శాఖలోని ఖాళీలు – 66
  • చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖలోని ఖాళీలు – 24
  • ట్రైబల్ కల్చర్ రీసెర్చ్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోని ఖాళీలు – 16
  • గిరిజన ఆర్ధిక సహకార సంస్థలోని ఖాళీలు – 15
  • ట్రైకార్ విభాగంలోని ఖాళీలు – 1

మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా కమిటీ ద్వారా ఎంపికచేయనున్న ఖాళీలు – 14

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =